రైతులను పూర్తిగా మోసం చే శారు
పెనుకొండ రూరల్ : కరువును నివారించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధపు మాటలతో రైతులను పూర్తిగా మోసం చేశాడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. మండలంలోని మరువపల్లి గ్రామంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో వేరుశనగ వేసిన రైతులకు రక్షక తడులు ఇస్తున్నామని సీఎం రైతులను మోసగిస్తున్నారన్నారు. రైతులు రెయిన్‌గన్లు, డీజల్ మోటార్లు ఇవ్వలేదని తమ ముందు వాపోతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. కల్లిబొల్లి మాటలతో రైతులను మోసం చేయకుండా వేరుశనగ పంటకు 100 శాతం ఫసల్ బీమా కల్పించాలని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం కూడా జిల్లాలో రైతులు వేరుశనగ పంట వేసి నష్టపోయారన్నారు. వారికి ఇంత వరకు బీమా మంజూరు చేయలేదని విమర్శించారు.