బాబు మోసాలతో నష్టపోయాం | Babu cheated | Sakshi
Sakshi News home page

బాబు మోసాలతో నష్టపోయాం

Published Thu, Sep 22 2016 12:05 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నాయకులకు కండవాలు కప్పుతున్న ద్వారకనాథరెడ్డి - Sakshi

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నాయకులకు కండవాలు కప్పుతున్న ద్వారకనాథరెడ్డి


– రాజన్న పాలనకోసం వైఎస్సార్‌సీపీలో చేరుతున్నాం
– 12మంది టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిక
కోసువారిపల్లె(తంబళ్లపల్లె):
‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలను గుర్తించాం. ఆయన పాలనలో సంక్షేమ పథకాలు అందక నష్టపోయాం. రాజన్న పాలనకోసం వైఎస్సార్‌సీపీలో చేరుతున్నాం’’ అంటూ టీడీపీ నాయకులు బాహటంగా తెలిపారు. గడపగడపకు వైఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారక నాథ రెడ్డి బుధవారం తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె పంచాయతీలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీలోని పలు పల్లెలకు చెందిన 12 మంది టీడీపీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. రామసుబ్బారెడ్డి, గంగుల్‌రెడ్డి, సిద్దారెడ్డి, వి.వెంకటరమణ, శేఖర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మురళీ, చలపతి, ఏ.వెంకటరమణ, మనోహర్, రామాంజులురెడ్డి, ఎరుకులరెడ్డిలకు ద్వారకనాథరెడ్డి కండువాలు కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారు మాట్లాడుతూ గతంలో తాము టీడీపీకి చెందిన వారమైనా మహానేత వైఎస్‌ఆర్‌ పాలనలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలతో లబ్ధిపొందామన్నారు. పంట నష్టపరిహారం, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు, రైతులకు పావులావడ్డీ రుణాలు ఇలా.. ఎన్నో విధాల లబ్ధిచేకూరిందన్నారు.  ప్రస్తుత ముఖ్యమంత్రి బాబు పాలనలో మోసపూరిత మాటలు తప్ప లబ్ధి చేకూరిందిలేదన్నారు. ఏదో సాకులతో సంక్షేమ పథకాల్లో సామాన్యులకు కోత విధిస్తున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కుటుంబంతో తంబళ్లపల్లె అభివృద్ధి సాధ్యమని ప్రజలకు అపారమైన నమ్మకం ఉందన్నారు. అందుకే ఆయనకు అండగా నిలిచేందుకు తామంతా వైఎస్‌ఆర్‌సీపీలో  చేరుతున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement