ఎన్నాళ్లు మోసం చేస్తారు?
కొమరాడ : చంద్రబాబు ప్రజలను మోసగిస్తూ..ఎంతకాలం పని చేస్తారని, టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బు ద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కొమరాడ మండల కేంద్రంలో గురువారం జరిగిన వైఎస్సార్ సీపీ మండల కార్యకర్తల విస్త్రృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఎన్నికల ముందు రైతులకు, మహిళా సంఘాలకు రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వ చ్చిందన్నారు. కానీ ఇప్పటివరకు రుణమాఫీ అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ పథకాల మంజూరులో జాప్యం వల్ల జిల్లాలో ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. పార్టీలో సీనియార్టీ కాదు, సిన్సీయార్టీ ముఖ్యమని తెలిపారు.
కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చి నా.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రజాపక్షాన పోరాడే ఒకే ఒక్క పార్టీ వైఎస్సార్ సీపీ అన్నారు. అర్హులైనప్పటికీ కొంతమందికి పింఛన్లు తొలగించారని, వారికి పింఛన్ పునర్ధురించే వరకు పోరాటం చేస్తానన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ చంద్రబా బు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ వచ్చే నెల 5వ తేదీన కలె క్టరేట్ వద్ద చేపట్టే ధర్నాకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జెడ్పీ మాజీ చైర్మన్ గులిపల్లి సుదర్శనరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బెల్లాన చం ద్రశేఖర్, నాయకులు సింగుబాబు, సీహెచ్ వెంకటరమణ, అంబటి శ్రీరాములునాయుడు, జైహిం ద్‌కుమా ర్, వి.శ్రీనివాసరావు, మామిడి అప్పలనాయుడు, తది తరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించడం
జియ్మమ్మవలస: వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పథకాల అమలులో అన్యాయం జరిగితే సహించేది లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్ర స్వామి హెచ్చరించారు.గురువారం చినమేరంగిలో కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలమైన ప్రతిపక్షంలో ఉన్నందున కార్యకర్తలు అధైర్యం పడాల్సినవసరం లేదన్నారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు అనేక వాగ్ధానాలు చేశారని, కానీ వాటిని నెరవేర్చడం లో విఫలమయ్యారని చెప్పారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి కార్యకర్తలంతా ముందుకు రా వాలని పిలుపునిచ్చారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ జూన్ 8న ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఇంతవరకు ప్రజలకు ఏమి చేశారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, వైస్ సర్పంచ్ అల్లు శ్రీని వాసరావు, ఈశ్వరరావు,ఆర్నిపల్లి వెంకటనాయుడు, నాగభూషణరావు, గౌరీశంకరరావు, పాల్గొన్నారు.