రైతులను మోసగిస్తున్న చంద్రబాబు
రైతులను మోసగిస్తున్న చంద్రబాబు
Published Mon, Jan 2 2017 11:42 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- ముచ్చుమర్రి వైఎస్సార్ పుణ్యమే
- ఆత్మకూరులో వైఎస్ జగన్ బహిరంగ సభను విజయవంతం చేయండి
- వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
ఆత్మకూరు: రాయలసీమ రైతులను సీఎం చంద్రబాబు నాయుడు మోసగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ రైతాంగానికి చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువేనని, ఈ విషయం ప్రతి రైతుకూ తెలుసన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను అప్పటి నందికొట్కూరు ఎమ్మెల్యే గౌరు చరిత... వైఎస్సార్ దృష్టికి తీసుకు వెళ్లారని చెప్పారు. దీంతో కేసీ రైతులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన ముచ్చుమర్రి వద్ద వైఎస్సార్ సర్వే చేయించారన్నారు. వైఎస్సార్ హయాంలోనే 90శాతం ఈ పథకం పూర్తయింన్నారు. మిగతా 10 శాతం పనులకు పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వానికి మూడేళ్లు పట్టిందన్నారు. నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాలతోపాటు రాష్ట్రంలోని పలు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సారే కారణమని, ఈ విషయాన్ని టీడీపీ తమ్ముళ్లు మర్చిపోవడం తగదన్నారు.
నెరవేరని హామీలు..
ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరిచారని గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో రాయలసీమ ప్రాంత వాసులు వరుసగా మూడేళ్లు కరవుకాటకాలతో తల్లడిల్లారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి 11 శాసనసభ స్థానాలు రావడంతో ఆయన ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారన్నారు.
బహిరంగ సభను విజయవంతం చేయండి
రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఈ నెల 5వ తేదీన ఆత్మకూరు పట్టణంలో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. జననేత..ఈ నెల 4న శ్రీశైలం చేరుకొని..డ్యాంను పరిశీలించి అక్కడే బస చేస్తారని, 5న దోర్నాల మీదుగా ఆత్మకూరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కుందూరు శివారెడ్డి, గోవిందగౌడు, లింగస్వామి, మోహన్‌రెడ్డి, రమణారెడ్డి, మాడుగుల లింగస్వామి, లింగమయ్య, గోకారి, బాలాజీ, కలిముల్లా తదితరులు పాల్గొన్నారు.
Advertisement