గడ్కరీతో మంత్రి శంకరనారాయణ భేటీ  | Minister Sankaranarayana meets Nitin Gadkari | Sakshi
Sakshi News home page

గడ్కరీతో మంత్రి శంకరనారాయణ భేటీ 

Feb 11 2022 5:00 AM | Updated on Feb 11 2022 5:00 AM

Minister Sankaranarayana meets Nitin Gadkari - Sakshi

కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని సన్మానిస్తున్న మంత్రి శంకర నారాయణ చిత్రంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ సమావేశమయ్యారు. ఢిల్లీలో గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి గడ్కరీని కలిశారు.

అనంతరం మంత్రి శంకరనారాయణ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ తూర్పు బైపాస్, విశాఖ–భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఆరు లేన్ల రహదారి, కడప–రేణిగుంట రహదారి నిర్మాణాలకు అవసరమైన నిధుల గురించి గడ్కరీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అనంతపురం, చిత్తూరుతోపాటు ఇతర జిల్లాల్లోని ముఖ్యమైన అంతర్రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరామన్నారు. తాము కోరిన అన్నింటికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement