జగిత్యాలటౌన్: ‘తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. ఆడబిడ్డనైన నన్ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్న మాటలు మీ ఆడబిడ్డలను అంటే మీకు సమ్మతమేనా..? నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి నన్ను ఏమన్నా ఒప్పుకుందా మా..? తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను అనుమతిద్దామా..? ’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో ప్రశ్నించారు. ఈ మేరకు కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్‌లో తాను ఓడిపోయాక, గెలిచిన వారికి పనిచేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నానని, గెలిచిన వ్యక్తి బాధ్యతలు విస్మరించి ఇష్టమొచ్చినట్లు వ్యక్తి గతంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా.. మీ అన్న చచ్చిపోతే పది లక్షలిస్తా.. మీ నాన్న ఇట్లా..’ అంటూ అర్వింద్ మాట్లాడటం.. ఇటువంటి భాషను ప్రయోగించడం ఎంతవరకు కరెక్టో ప్రజలు ఆలోచించాలని కవిత విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రాపాలకులపై మన నేతలు ఇలా అమర్యా దగా మాట్లాడలేదని గుర్తుచేశా రు. అలాంటి మర్యాదకరమైన రాజకీయాలు ఇప్పుడూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. కక్షలకు తెలంగాణలో తావులేదని స్పష్టం చేశారు. ఇలా అడ్డగోలుగా మాట్లాడేవాళ్లు ఉంటారనే అడబిడ్డలను ఉద్యోగాలకు పంపించడానికి తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి ఉందన్నారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చే ఆడబిడ్డలకు ఏం సందేశం ఇస్తున్నట్లని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment