సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీని అధికారంలో తెచ్చే వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ విషయమై శుక్రవారం(ఆగస్టు2) ఢిల్లీలో అర్వింద్ మీడియాతో మాాట్లాడారు.
నాకు సమర్థత ఉందని నేను అనుకుంటున్నా. కానీ అధిష్టానం గుర్తించాలి. రుణమాఫీ మొత్తం పూర్తయ్యే వరకు ఆగి మాట్లాడితే బాగుంటుంది. కేసీఆర్ పాలనలో అసెంబ్లీ జరగలేదు. ఇప్పుడు అసెంబ్లీలో అందరూ మాట్లాడుతున్నారు.
గతంలో కొందరు కన్ను మిన్ను కానకుండా మాట్లాడారు. రేవంత్ రెడ్డిని అనేకసార్లు కేసీఆర్ జైల్లో పెట్టారు. రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడం లేదు అని అర్వింద్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment