#PawanSaySorryToVolunteers: Pawan Kalyan Made Big Mistake By Making Allegations On Volunteers - Sakshi
Sakshi News home page

ఓరీ దత్తపుత్రా.. అందుకేనా వాలంటీర్లపై అడ్డగోలు వాగింది!

Published Mon, Jul 10 2023 8:51 PM | Last Updated on Tue, Jul 11 2023 11:25 AM

Pawan Kalyan Did Big Mistake With Allegations On Volunteers - Sakshi

వాళ్లు ఎండావానచలిని లెక్క చేయరు. తమ పరిధిలోని యాభై మందికి ఓర్పు.. ఓదార్పులే కాదు, సాయం చేసిన సందర్భాలనేకం. వ్యయప్రయాసలకు ఓర్చుకుని లబ్ధిదారుల కోసం బహుదూరం ప్రయాణించిన సందర్భాలూ.. గ్రామస్తుల కోసం సాహసాలు చేసిన సందర్భాలూ చూశాం. వ్యక్తిగత జీవితం కంటే విధి నిర్వహణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన వాళ్లను చూసే ఉంటాం!. అన్నికంటే ముఖ్యంగా.. కరోనా లాంటి మహమ్మారి సైతం వాళ్ల సంకల్పం ముందు చిన్నబోయింది. వాలంటీర్ల సైన్యం.. ఏపీ ప్రజానీకపు కుటుంబ సభ్యులు. అలాంటి సంక్షేమ సారథుల పట్ల.. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఎలా పడితే అలా వాగడం సరైందేనా దత్తపుత్రా?..   

ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుంటే ఫలితాలు ప్రజలకు అందుతుంటాయి. పేదల సంక్షేమానికి పథకాలు పెడితే.. అవి లబ్ధిదారులకు చేరుతాయి. కానీ, మధ్యలో దళారుల చేతివాటం, అవినీతి పరుల అక్రమాలు, నేతల పక్షపాత ధోరణి లాంటి వ్యవహారాలతో చొరబడే అవకాశాలు ఉంటాయి. ఆ లోటుపాట్లను అర్థం చేసుకున్నారు గనుకే.. ప్రభుత్వానికి- ప్రజలకు నడుమ ఒక వారధి ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలిచారు. సంక్షేమ సంధాన కర్తలుగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు.  గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగమై.. విప్లవాత్మక మార్పుతో ముందుకు పోతున్న ఈ విధానం గురించి బహుశా ఏమీ తెలియనివాళ్లు.. అర్థం చేసుకోని వాళ్లే ఇలా కారుకూతలు కూస్తుంటారేమో.. పిచ్చి రాతలు రాస్తుంటారేమో!. 
#PawanSaySorryToVolunteers

ప్రభుత్వం అందించే గౌరవ వేతనంతో స్వచ్ఛందంగా పని చేస్తూ.. క్రమశిక్షణ కలిగిన సైన్యమిది. ప్రతినెలా 1వ తేదీన అవ్వాతాతల ఇళ్ల తలుపు తట్టడమే కాదు. పొలాల్లోని రైతులు,ఆసుపత్రుల్లోని రోగులు సహా అందరినీ పరామర్శిస్తూ వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల నుంచి ఇతర సంక్షేమ ఫలాలను నేరుగా అందిస్తున్నారు. కాబట్టే... ఇపుడు రాష్ట్రంలో అర్హత ఉండి పథకం అందలేదనే వారెవరూ లేరు. వివక్షతో దూరమైన వారు లేరు. లంచాలివ్వాలని బాధపడేవారు లేరు. అందుకేనేమో!! జనానికి చేరువైన ఈ జగనన్న సైన్యంపై దొంగల ముఠాలో.. ఆ ముఠాలో ఒకడైన పవన్‌కు  వణుకు మొదలైనట్లుంది. 
#PawanSaySorryToVolunteers

వాలంటీర్‌ వ్యవస్థ విధులివే తెలుస్కో..  వాలంటీర్లూ అహర్నిశలూ పనిచేస్తున్నదనేది కాదనలేని వాస్తవం. లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తోంది. కొత్త రైస్‌ కార్డులివ్వటంతో పాటు రైస్‌ కార్డులున్న వారందరికీ సేవలందిస్తోందీ. వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద కొత్త కార్డులు మంజూరు చేయటం... ఆరోగ్య శ్రీని ఉపయోగించుకోవటంపై అవగాహన కల్పించటం చేస్తోంది.  

ఇదీ చదవండి: కరోనా టైంలో.. వలంటీర్లు ఉన్నారనే ధైర్యం
 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ కాపు నేస్తం, చేయూత, రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ జలకళ, వాహనమిత్ర, నేతన్న నేస్తం, ఆసరా, వైఎస్సార్‌ బీమా, సంపూర్ణ పోషణ, ఉచిత పంటల బీమా, లా నేస్తం, రైతులకు సున్నా వడ్డీ, ఆరోగ్య ఆసరా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, జగనన్న తోడు, రజకులు.. టైలర్లు... నాయీ బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, జీవ క్రాంతి, అమూల్‌ పాలవెల్లువ, కంటి వెలుగు, అమ్మ ఒడి... అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఒకసారి అందించే ఆర్థిక సాయం, పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు, ఈబీసీ నేస్తం వంటి పదుల కొద్దీ పథకాల ఫలాలను అర్హులకు చేరుస్తున్నారు.  
#PawanSaySorryToVolunteers

ఇవికాక వివిధ ప్రభుత్వ విభాగాలు సైతం వలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటున్నాయి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో అర్హత ప్రమాణాలను విచారించడంలో వీఆర్వోలకు సహకరిస్తున్నారు.  వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లకు, ఫీవర్‌ సర్వేలు, ఆరోగ్య సర్వేలకు వలంటీర్లే ఆధారం.  వాలంటీర్ల సాయం లేకుంటే ఆర్‌బీకే సిబ్బంది ఈ–క్రాప్‌ బుకింగ్‌కు రైతులను గుర్తించడం అంత తేలిక కాదు.  ప్రత్యేక వాహనాల్లో రేషన్‌ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు పూర్తి సహకారం వాలంటీర్లదే. ఇక తుపానులు, భారీ ప్రమాదాలు జరిగినపుడు చాలా మంది వలంటీర్లు స్వచ్ఛంద సైనికుల్లా రంగంలోకి దూకి సేవలందిస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన కోనసీమ వరదల్లో వలంటీర్ల సాయాన్ని అక్కడి ఏ వ్యక్తినడిగినా చెప్పకమానడు.  

ఇదీ చదవండి:  12 కిలోమీటర్ల కొండమార్గంలో ఆ వాలంటీర్‌..

64లక్షల మంది లబ్దిదారులకు ప్రభుత్వ పెన్షన్లను అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు. 2019నుంచి 2.66లక్షల మంది మహా సైన్యం వ్యవస్థ ప్రజలకు సేవలు అందిస్తోంది. మరి ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాలంటీర్లను చులకనగా చూడడం..  టార్గెట్‌ చేయడం దేని? బహుశా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే క్రమంలోనే కదా ఇదంతా జరుగుతోంది కాబోలు. ఇంతకన్నా ఘోరమైన కుట్ర ఉంటుందా?.. ఏమన్నావ్‌ పవన్‌.. వాలంటీర్‌లు సంఘవిద్రోహశక్తులా? వాళ్ల పనితనం గురించి ఏనాడైనా చూశావా?.. పోనీ వాళ్ల సేవలకు సంబంధించిన కథనాలు చదివావా?..
#PawanSaySorryToVolunteers

ఇదీ చదవండి: బ్రెయిన్‌ డెడ్‌ అయిన వలంటీర్‌ అవయవదానం

ఏమన్నావ్‌.. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులా?.. వ్యక్తిగత సమాచారం తస్కరిస్తారా? రాష్ట్రంలో వేల మంది మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమా?. వాళ్లేమైనా నీలాగా ప్యాకేజీ స్టార్‌ అనుకుంటున్నావా?.. లేదంటే పవిత్రమైన వివాహ బంధానికి తూట్లు పొడిచేవాళ్లు అనుకుంటున్నావా? వాళ్లు ప్రజల మనుషులు.. రియల్‌ పవర్‌ స్టార్లు.. అందుకే సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేసే ఘనతను ప్రభుత్వ ఖాతాలో కాకుండా ఆ ‘‘సేవా బలగం’’కే కట్టబెట్టి ప్రతీ ఏటా వాళ్లకు తగిన గౌరవం అందించి సీఎం జగన్‌ సత్కరిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నారు.
#PawanSaySorryToVolunteers

ఇదీ చదవండి: వేగులం కాదు.. ప్రజా సేవకులం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహాలో ఓసారి వాలంటీర్ల గురించి ఇలాగే వాగాడు. కానీ, జగన్‌ ఆలోచనకి ఉన్న పవర్‌ గుర్తించాడు గనుకే.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను కొనసాగిస్తానన్నాడు. కానీ, ఇప్పుడాయన దత్తపుత్రుడు మాత్రం ఘోరంగా అనుమానించి.. అవమానించాడు. ఆ వాగిన వాగుడుకు గట్టిగానే కౌంటర్‌ పడక మానదు. 
#PawanSaySorryToVolunteers

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement