సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 23నే తెలంగాణలోకి ప్రవేశించనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి ప్రవేశించాక రోజంతా యాత్ర సాగనుంది. అదే రోజు సాయంత్రానికి మక్తల్ చేరుకొని దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాదయాత్రకు రాహుల్ విరామం ప్రకటించి అక్కడే బస చేస్తారని.. ఈ నెల 26న మక్తల్‌లో రాహుల్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి.
యాత్ర రూట్‌మ్యాప్‌పై శనివారం గాంధీ భవన్‌లో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ పర్యవేక్షకులు బైజు, సుశాంత్ మిశ్రాలు పాల్గొన్నారు.
చదవండి: మునుగోడు కాంగ్రెస్‌లో ట్విస్ట్.. ‘బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్న వెంకటరెడ్డి!’
Comments
Please login to add a commentAdd a comment