Rahul Gandhi's convoy stopped by police during Manipur's visit: Updates - Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో రాహుల్‌ గాంధీ.. కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

Published Thu, Jun 29 2023 1:22 PM | Last Updated on Thu, Jun 29 2023 3:04 PM

Rahul Gandhi In Manipur Day 1 Visit Updates - Sakshi

ఢిల్లీ: హింసతో రగిలిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రెండురోజులపాటు పర్యటించేందుకు రాహుల్‌ గాంధీ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గురువారం అక్కడికి చేరుకున్న ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. 

ఘర్షనలకు కేంద్ర బిందువైన చురాచంద్‌పూర్‌ జిల్లా వైపుగా రాహుల్‌ కాన్వాయ్‌ వెళ్తుండగా.. ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపూర్‌ వద్ద పోలీసులు  అడ్డుకున్నారు. మార్గం మధ్యలోనే ఆయన కాన్వాయ్‌ను నిలిపివేశారు. ఈ విషయాన్ని పార్టీ సైతం ధృవీకరించింది. దీంతో రాహుల్‌ కాన్వాయ్‌ తిరిగి ఇంఫాల్‌ బయల్దేరింది. అనంతరం చాపర్‌లో ఆయన చురాచంద్‌పూర్‌కు వెళ్లనున్నారు.

కాగా మైతేయ్‌లకు ఎస్టీహోదాను వ్యతిరేకిస్తూ కుకీలు మే 3న నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ ర్యాలీ’ తీవ్ర ఘర్షణకు దారితీసింది. అప్పటి నుంచి హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటివల్ల 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 శిబిరాల్లో 50 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు.  రాహుల్‌ గాంధీ  చురాచాంద్‌పుర్‌ శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలను పరామర్శించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement