సాక్షి, ఖమ్మం: భారత్ జోడో యాత్రకు తెలంగాణ ప్రజలు అండగా నిలిచారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని రాహుల్ ప్రకటించారు. గిరిజనులకు పోడు భూములు ఇస్తామని ఆయన తెలిపారు.
ఖమ్మంలో జన గర్జన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై విమర్శల వర్షం కురిపించారు. దేశాన్ని కలపడం మన విధానం.. విడదీయడం బీజేపీ విధానం.. కాంగ్రెస్ సిద్ధాంతాలకు ప్రజలు అండగా నిలిచారన్నారు. ప్రజల మనస్సుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది’’ అని రాహుల్ పేర్కొన్నారు.
‘‘అనేక వర్గాల ప్రజలకు తెలంగాణ స్వప్నంగా ఉండేది. 9 ఏళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలను బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్ అంటే బీజేపీకి బంధువు పార్టీ తెలంగాణ తాను రాజుగా కేసీఆర్ భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగింది. ధరణితో ముఖ్యమంత్రి భూములు దోచుకుంటున్నారు. మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారు’’ అని రాహుల్ దుయ్యబట్టారు.
చదవండి: రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి
‘‘కర్ణాటకలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాం. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచారు. కర్ణాటకలో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. బీజేపీకి తెలంగాణలో బీఆర్‌ఎస్ బీ టీమ్.. బీజేపీ బీ టీమ్‌తో మా పోరాటం కొనసాగుతోంది. కేసీఆర్ అవినీతికి మోదీ ఆశీస్సులు ఉన్నాయి’’ అంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు.
చదవండి: బండి సంజయ్‌పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిందెవరు?
Comments
Please login to add a commentAdd a comment