అమరావతి: చంద్రబాబు కోసమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పని చేస్తోందని విమర్శించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు
సజ్జల. తమ వారికి లబ్ధి చేకూరేలా రెండుసార్లు ఇసుక పాలసీని మార్చారని, టీడీపీ నాయకులు ఇసుక ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సజ్జల ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ. వేల కోట్లు పక్కదారి పట్టాయన్నారు.పురంధేశ్వరి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుపై కేసు ఎందుకు పెడతారని ఎద్దేవా చేసిన సజ్జల.. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ కేసు నమోదు చేసిందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు షర్మిల మద్దతివ్వడం ఆమె పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం కావొచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు. పక్కరాష్ట్ర విషయాల గురించి సీఎం జగన్ పెద్దగా పట్టించుకోరని తెలిపిన సజ్జల.. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందన్న విషయం అందరికీ తెలుసన్నారు. సోనియా దగ్గరికి వెళ్లినప్పుడు జగన్‌తో పాటు షర్మిలమ్మ కూడా వచ్చిందని, అయినా విధానపరమైన నిర్ణయంలో భాగంగా కాంగ్రెస్ మద్దతిచ్చి ఉండొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment