సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విటర్ ఖాతాను యాజమాన్యం తాత్కాలికంగా నిలపివేసింది. అమిత్ షా పెట్టిన ఫోటోను సాంకేతికపరమైన కారణాలు చేసి ట్విటర్ తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం తిరిగి సేవలను పునరుద్దరించింది. డిస్‌ప్లే పిక్చర్‌పై క్లిక్ చేసినప్పుడు మీడియా నాట్ డిస్‌ప్లేయిడ్ అంటూ ఖాళీ పేజీతో పాటు కాపీరైట్ల కారణంగా ఈ ఫోటోను తీసివేయడమైందని చూపించింది. అయితే, కొంత సమయం తర్వాత కేంద్ర మంత్రి ట్విట్టర్ ఖాతా కాపీరైట్ హోల్డర్ రిపోర్ట్ కారణంగా, తాము గ్లోబల్ కాపీరైట్ పాలిసీ కింద గురువారం తాత్కాలికంగా మూసివేశామని వివరించింది. ప్రస్తుతం యధాలాపంగానే నడుస్తుందని మైక్రోబ్లాగింగ్ సైట్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, అమిత్ షాకు ట్విట్టర్ లో 23.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment