
మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు
మందస: రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు నిలిపివేయడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లీనిక్ కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధిని ఓర్వలేక తెలుగుదేశం నాయకులు, పచ్చబ్యాచ్ పత్రికలు, ఛానళ్లతో బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రూ.2లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఓ వైపు ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే.. మరో వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు జగనన్న తీసుకెళ్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment