
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానానికి కేశినేని నాని పరోక్షంగా సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పందిస్తూ.. ఎంపీగా టీడీపీ ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. తను ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రజలు కోరుకుంటే గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
తన మాటలను పార్టీ ఎలా తీసుకున్నా తనకు భయం లేదని కేశినేని నాని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో పార్టీలతో సంబంధం లేదని అన్నారు. ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకేనని పేర్కొన్నారు.
కాగా టీడీపీ తరపున విజయవాడ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు ఎంపీ కేశినేని నాని. అయితే 2019లో రెండోసారి గెలిచిన తరువాత ఆయనకు పార్టీకి మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న కేశినేని నాని సమయం దొరికినప్పుడల్లా తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదు: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment