Telangana Congress Election Strategy Meet Updates And Latest News - Sakshi
Sakshi News home page

విబేధాలు పక్కనపెట్టి నాయకులంతా ఏకతాటిపై నడవాలి: రాహుల్‌ గాంధీ

Published Tue, Jun 27 2023 10:37 AM | Last Updated on Tue, Jun 27 2023 3:27 PM

Telangana Congress Election Strategy Meet Updates - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ రచన సమావేశం ముగిసింది. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. టీపీసీసీ నేతల సూచనలు, సలహాలు రాహుల్‌ విన్నారు. అయితే నాయకులంతా ఏకతాటిపై నడవాలని రాహుల్‌ గాంధీ కోరారు. కేసీఆర్‌ను ఓడించేందుకు నేతలందరూ విబేధాలు, చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టాలని సూచించారు. 

తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జి మానిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. అందరి సూచనలను రాహుల్ గాంధీ విన్నారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాల గురించి చర్చించామన్నారు. తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం లూటీ చేసిందని విమర్శించారు.

కాగా భారీ చేరికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ సంతరించుకుంది. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం, జూన్‌ 27) కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహ సమావేశం జరిగింది. రాహుల్‌ నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీకి.. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిలతో పాటు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ తదితరలు ఈ ఎన్నికల ‍వ్యూహ భేటీకి హాజరయ్యారు. 

వాళ్లు మాత్రం అసంతృప్తిలో..
ఇదిలా ఉంటే.. సీనియర్ల అసంతృప్తి చల్లారిన వేళ.. ఇప్పుడు వర్గ పోరులు, మిగతా వాళ్ల అలకలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహ సమావేశానికి తమను పిలవలేదని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి రేవంత్‌రెడ్డితో పాటు 15 మందికి మాత్రమే ఆహ్వానం అందింది. జాబితాలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో తమను ఆహ్వానించకపోవడంపై మిగతా వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అలకబూనినట్లు సమాచారం.

ఇదీ చదవండి: తెలంగాణలో అప్నా టైం ఆయేగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement