strategy meeting
-
నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాంంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీలో చర్చిస్తారు. స్వల్ప జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఇంటికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు సమాచారం. విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్వరలో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. -
ముగిసిన టీ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ సమావేశం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ రచన సమావేశం ముగిసింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. టీపీసీసీ నేతల సూచనలు, సలహాలు రాహుల్ విన్నారు. అయితే నాయకులంతా ఏకతాటిపై నడవాలని రాహుల్ గాంధీ కోరారు. కేసీఆర్‌ను ఓడించేందుకు నేతలందరూ విబేధాలు, చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టాలని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మానిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. అందరి సూచనలను రాహుల్ గాంధీ విన్నారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాల గురించి చర్చించామన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని విమర్శించారు. కాగా భారీ చేరికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ సంతరించుకుంది. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం, జూన్ 27) కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ సమావేశం జరిగింది. రాహుల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీకి.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలతో పాటు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ తదితరలు ఈ ఎన్నికల వ్యూహ భేటీకి హాజరయ్యారు. వాళ్లు మాత్రం అసంతృప్తిలో.. ఇదిలా ఉంటే.. సీనియర్ల అసంతృప్తి చల్లారిన వేళ.. ఇప్పుడు వర్గ పోరులు, మిగతా వాళ్ల అలకలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ సమావేశానికి తమను పిలవలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి రేవంత్‌రెడ్డితో పాటు 15 మందికి మాత్రమే ఆహ్వానం అందింది. జాబితాలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో తమను ఆహ్వానించకపోవడంపై మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లు అలకబూనినట్లు సమాచారం. ఇదీ చదవండి: తెలంగాణలో అప్నా టైం ఆయేగా -
తెలుగు తమ్ముళ్ల మధ్య మళ్లీ డిష్యుం డిష్యుం
తెలుగు తమ్ముళ్లు మళ్లీ మాటలతో కలబడ్డారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వ్యూహాత్మక సమావేశంలో తెలంగాణ - సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు పరస్పరం వాదించుకున్నారు. అసెంబ్లీలో అసలు సమన్యాయం అనకుండా సమైక్యాంధ్ర అని ఎలా అంటారంటూ తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకులు అభ్యంతరం లేవనెత్తారు. అయితే, టీఆర్ఎస్ నాయకులు పోడియం వద్దకు వెళ్లినప్పుడు తెలంగాణ టీడీపీ నాయకులు కూడా వెళ్లాలని సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు సూచించారు. దీంతో ఇరువురికీ సర్దిచెప్పలేక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తల పట్టుకున్నట్లు తెలిసింది.