తెలుగు తమ్ముళ్ల మధ్య మళ్లీ డిష్యుం డిష్యుం | TDP leaders fight among in strategy meeting | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల మధ్య మళ్లీ డిష్యుం డిష్యుం

Published Thu, Dec 12 2013 2:00 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

TDP leaders fight among in strategy meeting

తెలుగు తమ్ముళ్లు మళ్లీ మాటలతో కలబడ్డారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వ్యూహాత్మక సమావేశంలో తెలంగాణ - సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు పరస్పరం వాదించుకున్నారు. అసెంబ్లీలో అసలు సమన్యాయం అనకుండా సమైక్యాంధ్ర అని ఎలా అంటారంటూ తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకులు అభ్యంతరం లేవనెత్తారు.

అయితే, టీఆర్ఎస్ నాయకులు పోడియం వద్దకు వెళ్లినప్పుడు తెలంగాణ టీడీపీ నాయకులు కూడా వెళ్లాలని సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు సూచించారు. దీంతో ఇరువురికీ సర్దిచెప్పలేక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తల పట్టుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement