Telugu Top 10 News: Today Evening Highlight 1st July 2022 - Sakshi
Sakshi News home page

Telugu Trending News Today: అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!

Published Fri, Jul 1 2022 4:55 PM | Last Updated on Fri, Jul 1 2022 5:47 PM

Telugu Top 10 News Today Evening Highlight 1st July 2022 - Sakshi

1. నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్‌ వార్నింగ్‌
సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తొలిసారి ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిసిన ఉద్దవ్‌.. షిండే అసలైన సీఎం కాదని విమర్శించారు. మెట్రో ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం ముందుకెళ్లరాదని హెచ్చరించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. HYD: వాహనదారులకు అలర్ట్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవే..
నగరంలోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద శుక్రవారం భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనందర్‌ పరిశీలించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ‘చంద్రబాబు సీఎంగా ఉంటే కరోనా వచ్చేది కాదంట..’
చంద్రబాబు పాలనంతా అబద్ధాలమయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. కరోనా వైరస్‌ కాదు.. బయో వార్‌ అది!: ఉత్తర కొరియా సంచలన ఆరోపణలు
ప్రపంచమంతా కరోనా వైరస్‌ను సాధారణ పరిస్థితులుగా భావిస్తున్న తరుణంలో.. ఉత్తర కొరియాలో మాత్రం తాజా విజృంభణతో లక్షల మంది వైరస్‌ బారినపడ్డారు. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తిపై సంచలన ఆరోపణలకు దిగింది ఆ దేశం. పొరుగుదేశం బయో వార్‌కు ప్రయత్నించిందనేది కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తాజా ఆరోపణ.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


5. కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్‌
తెలంగాణకు కేంద్రం నుంచి ఒక మంచిపనైనా చేయించడం చేతగాని దద్దమ్మగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మిగిలిపోయారంటూ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను మోసం చేస్తోంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాదా? విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కిషన్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు?
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఆమె వివరాలు చెప్పండి.. నా వంతు సాయం చేస్తా: కేటీఆర్‌
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఎవరైనా బాధితులు.. సాయం కోసం సోషల్‌ మీడియాలో కేటీఆర్‌ను సాయం అడిగితే వెంటనే స్పందించి.. వారికి తన వంతు సాయం అందిస్తుంటారు. తాజాగా ఓ వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్‌.. బాలిక వివరాలను చెప్పాలని ఆమెకు సాయం అందిస్తానని ట్విట్టర్‌ వేదికగా కామెంట్స్‌ చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Ind Vs Eng: నాకు దక్కిన గొప్ప గౌరవం.. బుమ్రా భావోద్వేగం
ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టు నేపథ్యంలో రోహిత్‌ శర్మ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. తొలిసారి భారత జట్టు సారథి హోదాలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌తో కలిసి టాస్‌ సమయంలో ఎడ్జ్‌బాస్టన్‌ మైదానానికి వచ్చాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. కేంద్రం కీలక నిర్ణయం, పెట్రో ఎగుమతులపై ట్యాక్స్‌ పెంపు..
వాహనదారులకు కేంద్రం షాకిచ్చింది. పెట్రో ఎగుమతులపై విధించే ట్యాక్స్‌ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌పై రూ.6, లీటర్‌ డీజిల్‌ ఎగుమతులపై రూ.13 పెంచుతున్నట్లు ప్రకటించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ‘పక్కా కమర్షియల్‌’మూవీ రివ్యూ
వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్'. మ్యాచో హీరో గోపీచంద్‌, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఉదయ్‌పూర్‌ ఘటన నూపుర్‌ వల్లే జరిగింది.. సుప్రీం కోర్టు మండిపాటు
బీజేపీ సస్పెండెడ్‌ నేత నూపుర్‌ శర్మపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వెల్లగక్కింది. అధికారం ఉందనే పొగరు తలకెక్కి నూపుర్‌ శర్మ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని శుక్రవారం మండిపడింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement