
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నాయకత్వ మార్పు తప్పదా?.. పార్టీ చీఫ్‌ను మారుస్తారనే ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. అందుకు కారణం.. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇవాళ(శుక్రవారం) ఢిల్లీకి బయల్దేరడం!.
వర్గ పోరుతో తెలంగాణ బీజేపీ సతమతమవుతోంది. ఈ ఎఫెక్ట్ వల్ల క్యాడర్‌లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. కలిసి పని చేయకపోగా.. పరోక్ష విమర్శలతో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నారు పార్టీ కీలక నేతలు. ఈ తరుణంలో.. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముందు నాయకత్వ మార్పుపైనా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
గత పదిహేను రోజులుగా పార్టీకి చెందిన ముగ్గురు అగ్రనేతలు హస్తిన పర్యటనలు చేశారు. మరోవైపు బీజేపీ క్యాడర్‌లో గత వారం రోజులుగా అయోమయం నెలకొంది. ఇంకోవైపు ఎన్నికలకు పట్టుమని ఐదు నెలలు కూడా లేదు. దీంతో తెలంగాణ బీజేపీకి బూస్టింగ్ ఇవ్వడానికే అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అవన్నీ రైతు ఆత్మహత్యలు కావు..!!
Comments
Please login to add a commentAdd a comment