![Will Stay Out Of The government Says BJP Leader Devendra Fadnavis - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/30/eee.jpg.webp?itok=Yc80yLsU)
సాక్షి, ముంబై: అనేక మలుపులు తిరిగిన ‘మహా’ క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ నెలకొంది. విమర్శలకు చెక్ పెట్టేందుకు బీజేపీ ఆచితూచీ అడుగులు వేసింది. సీఎం పీఠాన్ని వదులుకున్న బీజేపీ.. మద్దతుకే పరిమితమైంది. రెబెల్స్ ఆధ్వర్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ఏక్‌నాథ్ షిండేకు బయట నుంచి మద్దతు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
నేడు(గురువారం రాత్రి 7.30 నిమిషాలకు మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు. షిండే ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యత తమదేనని అన్నారు. సిద్ధాంతపరంగా తామంతా ఒక్కటేనన్నారు. ఏక్‌నాథ్ సీఎం అవుతారని, కేబినెట్ విస్తరణలో శిసేన, బీజేపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. తాను ప్రభుత్వం నుంచి దూరంగా ఉంటున్నట్లు ఫడ్నవీస్ ప్రకటించారు.
చదవండి: ‘మహా’ ట్విస్ట్.. సీఎం పీఠం వదులుకున్న బీజేపీ..
Comments
Please login to add a commentAdd a comment