పవన్‌.. అబద్దానికి రెక్కలు కట్టడం సనాతన ధర్మమా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Political Comments On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాపం ఏపీ ప్రజలపై పడవద్దని దేవుడ్ని కోరుకుంటా: వైఎస్‌ జగన్‌

Published Fri, Oct 4 2024 4:03 PM | Last Updated on Fri, Oct 4 2024 4:52 PM

YS Jagan Political Comments On Chandrababu And Pawan Kalyan

సాక్షి తాడేపల్లి: తిరుమల ప్రతిష్టను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని అన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పినా దురుద్దేశంతో ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. లడ్డూ విషయంలో జరిగింది అబద్ధమని తెలిసినా పవన్‌ కల్యాణ్‌ దానికి రెక్కలు కట్టారని ఆరోపించారు. అబద్ధాలతో తిరుమల విశిష్టతను దెబ్బతీయడమేనా సనాతన ధర్మం అని ప్రశ్నించారు. 

తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు చెబుతున్న అబద్ధాలపై వైఎస్‌ జగన్‌ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తప్పును గుడ్డిగా సమర్థిస్తూ సనాతన ధర్మమని చెప్పుకోవడం ధర్మమా. ఇది అబద్ధమని తెలిసినా దానికి పవన్‌ రెక్కలు కట్టారు. తిరుమల శ్రీవారి విశిష్టతను దెబ్బతియడంలో పవన్‌ కూడా భాగమయ్యాడు. సనాతన ధర్మమంటే పవన్‌కు తెలుసా?. దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకునే బుద్ధి చంద్రబాబుకు ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితో వీళ్లు ఆడుకుంటున్నారు. వాళ్లకు వెంకన్న స్వామే మొట్టికాయలు వేస్తారు. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆటలా? అని ప్రశ్నించారు. 

భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పింది. రాజకీయ డ్రామాలు చేయవద్దని హెచ్చరించింది. చంద్రబాబు మంచి వ్యక్తి అయితే ఆధారాలను చూసి సిగ్గుపడాలి. అబద్దాలు చెప్పడంలో వీళ్లు దిగజారిపోతున్నారు. చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు చేసిన పాపానికి దేవుడి కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడవద్దని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసిన వారిపైనే దేవుడు తన కోపం చూపించాలి. అన్యాయాలు చేసిన వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తున్న సమయంలో టాపిక్‌ డైవర్షన్‌ కోసం ఇలా చేశారు’ అని చెప్పుకొచ్చారు. 

 

ఇది కూడా చదవండి: ‘దేవుడంటే చంద్రబాబుకు భయమూ, భక్తి రెండూ లేవు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement