
సాక్షి, తాడేపల్లి: నెల్లూరులో ఓ అమాంబాపతిగాడు కాకిలా అరుస్తూ దాడి జరిగిందని గగ్గోలు పెడుతున్నాడని, ప్రెస్ నోట్‌లు పెడుతున్నాడని ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ప్రతినిధి రవిచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి అంశంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు రవిచంద్రారెడ్డి.
‘‘నారా లోకేష్ పాదయాత్రలో అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. తొడలు కొట్టి ప్రగల్బాలు పలుకుతున్నారు. లోకేష్‌పై కోడిగుడ్లు వేసి కోడి గుడ్డు ను ఎవరు వేస్ట్ చేసుకోరు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ గా మార్చారు. బూతులు తిట్టడానికి కొందరు టీడీపీ నాయకులను కేటాయించారు. లోకేష్ సీఎం జగన్ ఆరోగ్యం పై అవాకులు మాట్లాడాడు. చంద్రబాబు ఎక్కడైనా రక్త పరీక్షలకు సిద్ధమా..? లోకేష్ మీ నాన్న చొక్కా విప్పి చూపించగలరా.?
చంద్రబాబు, లోకేష్ లు అధికారం పోయి సైకో లుగా మారారు. టీడీపీ దివాలా కోరు పార్టీ గా మారింది. ఆనం వెంకటరమణ రెడ్డి ని కొట్టాల్సిన అవసరం ఎవడికి ఉంది?. నారా లోకేష్ తన తండ్రి నేర్పని ఏవైతే రెండు గుణాలు ఉన్నాయో.. సభ్యత, సంస్కారంతో మాట్లాడటం నేర్చుకోవాలంటూ రవిచంద్రారెడ్డి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment