Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

KSR Comment: Atchannaidu Open U On CBN Cheating1
అచ్చెన్నాయుడు గుట్టు బయటపెట్టేశాడే!

ఆడబిడ్డ నిధి పేరుతో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యఏపీలో ఐదేళ్ల ఫించన్‌ సొమ్ముతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చు.. ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడునేనేదో చేసేస్తానని ఆశ పడుతున్నారు.. ఖజానా ఖాళీగా ఉంది.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు2024 ఎన్నికల సమయంలో వీరు ఈ మాటలు మాట్లాడి ఉంటే వారి చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయి ఉండేది. కానీ అప్పుడేమి బొంకారో గుర్తు చేసుకోండి. చంద్రబాబైతే.. తనకు సంపద సృష్టించడం తెలుసన్నాడు. సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికను అమలు చేసి చూపిస్తామని బల్లగుద్ది మరీ బుకాయించారు. బాబు గారి పుత్రరత్నం లోకేశ్‌ ఇంకో అడుగు ముందుకేసి.. అన్ని వాగ్దానాల అమలుకు పక్కా ప్లాన్ ఉందని, లెక్కలున్నాయని, తాము చేయలేకపోతే ప్రజలు చొక్కా కాలర్ పట్టుకోవచ్చు.. అని ఛాలెంజ్‌ కూడా చేశారాయె! ఇక జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి మాటలు ఒకసారి గమనించండి.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక అమలుకు తనదీ గ్యారెంటీ అని గొప్పగా భరోసా ఇచ్చారు. అధికారం వచ్చింది.. ఏడాది గడిచింది. ఇప్పుడు ఒక్కరొక్కరుగా తమ మనసులోని మాటలు బయటపెట్టేసుకుంటున్నారు.... ప్రజలను మోసం చేయడానికే హామీలు ఇచ్చామన్నట్టుగా మాట్లాడేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలిచ్చిన వాగ్ధానాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చాలా విస్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే.. తామిచ్చిన నవరత్నాల హామీ అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల వరకు అవుతోందని, దానిని భరించడానికే చాలా కష్టపడవలసి వస్తోందని, కూటమి ఇస్తున్న సూపర్ సిక్స్, తదితర హామీల అమలుకు రూ.1.5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, అంత మొత్తం ఎలా తెస్తారు? అని! చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజలను మోసం చేస్తున్నారని పదే, పదే చెప్పేవారు. అయినా టీడీపీ, జనసేన నేతలు బుకాయించి, దబాయించి మరీ తమ సూపర్ సిక్స్ అమలు చేసి చూపిస్తామని అనేవారు. తమ వద్ద మంత్రదండం ఉందని చంద్రబాబు అనేవారు. ఇప్పుడేమో ఖజానా ఖాళీగా ఉందంటున్నారు. వీటితోపాటు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అంటూ మరికొన్ని వాగ్దానాలు కూడా చేశారు. అందులో పరిశ్రమలు స్థాపించే ప్రతి వ్యక్తికి గరిష్టంగా రూ.పది లక్షల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అవన్ని అయిపు లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ వీటిపై గట్టిగా నిలదీస్తుండడం, మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే, పదే కూటమి నేతల ఎన్నికల ప్రణాళికను గుర్తు చేస్తుండడంతో తప్పనిసరి స్థితిలో సుమారు 150 హామీలలో రెండు, మూడింటిని అరకొరగా అమలు చేశారు. ఈ నేపథ్యంలో.. హమీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోయేసరికి ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. దానిని ఎలా అధిగమించాలా?అనే ఆలోచనతో రెడ్ బుక్ పాలన ద్వారా వైసీపీ వారిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్నారు. కేసులు పెట్టి కూటమికి మద్దతు ఇచ్చే మురికి మీడియాలో ఆ కేసుల వార్తలనే ప్రముఖంగా ప్రచారం చేయిస్తున్నారు. ఈ దశలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. ఏదో గుట్టుగా మోసం చేయవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే, ఈయన రహస్యాన్ని బట్టబయలు చేశారని అనుకోవాలి.ఆడబిడ్డ నిధి పధకం కింద 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలని అచ్చెన్న ఓపెన్‌గానే చెప్పేశారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఎవరైనా విశ్లేషకులు చెబితే వారిమీద మండిపడేవారు. వైఎస్సార్‌సీపీ వాళ్లు ‘అదెలా సాధ్యం?’ అని అడిగితే విరుచుకుపడే వారు. చంద్రబాబు అన్ని హామీలు అమలు చేసి చూపిస్తారని ప్రచారం చేసేవారు. చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా అత్యధికశాతం ‘మాట తప్పడమే’ అని జనానికి తెలిసినా, పవన్ కళ్యాణ్ కూడా జత కలవడం, బీజేపీ మద్దతు ఉండడంతో ఏమో ఈసారి ఏమైనా చేస్తారేమోలే అని ఆశ పడ్డవారు గణనీయంగానే ఉన్నారు. సూపర్ సిక్స్ ఎఫెక్ట్‌తో పాటు ఈవీఎంల మాయాజలం కలిసి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వృద్ధుల ఫించన్‌ను రూ. వెయ్యి పెంచారు. ఈ అదనపు పింఛన్‌ మొత్తాన్ని అందచేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ వేసుకువెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ 13 నెలల కాలంలో ఆ వ్యయం కోట్లు దాటిపోతుంది. ఇంకోపక్క ఫించన్‌దారులకు లక్షల సంఖ్యలో కోత పెడుతున్న వార్తలు వస్తున్నాయి. ఏడాదికి మూడు గ్యాస్ బండలు ఉచితం అని చెప్పినప్పటికి అది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఒక గ్యాస్ బండ తాలూకూ డబ్బు మాత్రమే కొందరికి అందింది. మిగిలిన హామీలను ఒక ఏడాదిపాటు ఎగవేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. తల్లికి వందనం కింద చదువుకునే విద్యార్ధులకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి ఒక ఏడాదంతా ఇవ్వలేదు. జగన్ విమర్శల ప్రభావంతో ఆ స్కీములో రూ.రెండు వేలు కోతపెట్టి కొంతవరకు అమలు చేసినా, అది కూడా గందరగోళంగానే జరిగినట్లు చెబుతున్నారు. ఇక.. మిగిలిన హామీలేవీ నెరవేర్చక పోవడంతో జనం ఆగ్రహం చెందుతున్నారు. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలందరికి నెలకు1500 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి సుమారు రూ.35వేల కోట్లు అవుతుందన్నది ఒక అంచనా. ఆ గణాంకాలను కొందరు నిపుణులు చెప్పకపోలేదు.కాని టీడీపీకి భజన చేసే మురికి మీడియా కూడా జనాన్ని మోసం చేయడానికి అదంతా సాధ్యమేనన్నట్లు ప్రచారం చేసింది. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఇంకోమాట మాట్లాడుతున్నారు. అంతేకాక చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని ముందుగానే అనుకున్నామని వెల్లడించారు. అంటే దీని అర్థం చంద్రబాబు మోసం చేయబోతున్నారని తమకు తెలుసునని చెప్పడమే అవుతుంది కదా!. అయినా పథకాలన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అచ్చెన్న ముక్తాయించారు. అంటే గతంలో మాదిరి ఎన్నికల సంవత్సరం చివరిలో ఏదో చేసేశామని చెప్పి జనాన్ని మాయ చేసే అవకాశం ఉందని అనుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, ఫించన్లు ఇవ్వడానికే సరిపోతోందని కూడా అచ్చెన్నాయుడు సెలవిచ్చారు. చిత్రం ఏమిటంటే ఎన్నికల ప్రణాళికలోని ఆడబిడ్డ నిధి స్కీము తప్ప అన్నిటిని అమలు చేసేశామని మంత్రి ప్రకటించడం. ఇది చంద్రబాబు చెబుతున్న తీరుగానే ఉంది. అది నిజమే అయితే ఎన్నికల మానిఫెస్టో చదువుతూ ఏ ఏ అంశాలు ఎలా అమలు చేస్తున్నది వివరించగలగాలి. కాని ఆ పని చేయరు.అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి బీసీలకు ఏభైఏళ్లకే పింఛన్‌ తదితర హామీల సంగతేమిటో మంత్రి చెప్పాల్సి ఉంటుంది. 2017లో జగన్ నవరత్నాల స్కీములను ప్రకటించినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసేది. అవి సాధ్యం కాదని అనేది. కాని జగన్ సీఎం అయి అమలు చేసి చూపించారు. అప్పుడు ఏపీ శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతోపాటు మురికి మీడియా విషం చిమ్మేది. కాని అదే సమయంలో టీడీపీ, జనసేన ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్సార్‌సీపీ ఇచ్చే సంక్షేమం కన్నా రెండు, మూడు రెట్లు అధికంగా ఇస్తామని నమ్మబలికేవారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కూడా సంక్షేమ స్కీముల గురించి పలుమార్లు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఐదేళ్ల పెన్షన్లకు అయ్యే వ్యయంతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని చెబుతున్నారట. దీనిని బట్టి వారి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎన్నికలకు ముందు విద్యార్థులు, మహిళలు ఎవరు కనిపించినా నీకు 15వేలు, నీకు 18 వేలు అంటూ సైకిల్ వేసుకుని వెళ్లి మరీ చెప్పిన నిమ్మల ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు అచ్చం గురువుకు తగ్గ శిష్యులే అనిపించుకుంటున్నారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Kethireddy Venkatarami Reddy Sensational Comments On Chandrababu And Pawan Kalyan2
కూటమి కొత్త కథ .. రాబోయే రోజుల్లో పవన్‌ జీరో

సాక్షి: తాడేప‌ల్లి:ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్‌లో పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం ఒక కొత్త కథను అల్లి ఎల్లో మీడియా ప్రచురిస్తుంటే, దానిని బట్టి సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకువెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్ట్‌కు సమర్పించని రిమాండ్ రిపోర్ట్‌లు కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు ముందుగానే ప్రచురితం అవుతున్నాయంటేనే సిట్ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబుకు భజన చేస్తున్న ఎల్లో మీడియా ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసమే ఇలాంటి దుర్మార్గమైన కథనాలను రాసి, సిట్‌ను నడిపిస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతలను కక్షపూరితంగా అరెస్ట్‌లు చేయిస్తున్న చంద్రబాబు దుర్మార్గాల్లో ఎల్లో మీడియా భాగస్వామిగా మారింది. జరగని అవినీతిపై ఎలా దర్యాప్తు చేయాలో తెలియక తల పట్టుకుంటున్న సిట్ బృందానికి చక్కని కథలు, టీవీ సీరియల్స్‌ను రాసి, వారితో ఎవరెవరిపై ఎలా తప్పుడు కేసులు బనాయించాలో రోజుకో కథనం రాసే బాధ్యతను ఎల్లో మీడియాకు చంద్రబాబు అప్పగించారు. అందుకే ప్రతిరోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు విచిత్రమైన అంశాలను రాస్తూ, తమ ఊహలను వార్తలుగా ప్రచురిస్తూ ఏం చేయాలో సిట్ బృందానికి దిశానిర్ధేశం చేస్తున్నాయి. లిక్క‌ర్ కేసులో చంద్ర‌బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ రిమాండ్ రిపోర్టుని కోర్టుకు స‌మ‌ర్పించ‌కుండానే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలో దానిపై అక్షరం పొల్లుపోకుండా క‌థ‌నాలు ప్ర‌త్య‌క్షం అవుతున్నాయి. జ‌డ్జి ముందు పెట్టాల్సిన డాక్యుమెంట్ వారం ముంద‌రే ఈ రెండు పేప‌ర్ల‌కి ఎలా లీక‌వుతోంది.? ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలో ఎవ‌రి మీద‌నైతే వార్త‌లు రాస్తున్నారో సిట్ వారి మీద‌నే కేసులు న‌మోదు చేస్తుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఎల్లో మీడియా చెప్పిన‌ట్టు సిట్ న‌డుస్తుందా అనే అనుమానాలు క‌ల‌గకుండా ఉండ‌వు. సిట్ కి విశ్వ‌స‌నీయత లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తుంది. రెండు అపార్టుమెంట్‌ల నిండా వేల కోట్ల డ‌బ్బులు దాచిపెట్టార‌ని ఇష్టానుసారం ఎల్లో మీడియా ఛానెళ్ల‌లో డిబేట్లు న‌డుపుతున్నారు. త‌ప్పుడు క‌థ‌నాలు రాసి విష ప్ర‌చారం చేస్తున్నారే కానీ, ఎక్క‌డా అంత పెద్ద మొత్తంలో సిట్ డ‌బ్బులు సీజ్ చేసింది కూడా లేదు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన‌ప్పుడు రూ.50 వేల కోట్ల లిక్క‌ర్ కుంభ‌కోణం జ‌రిగింద‌ని ప్ర‌చారం చేశారు. ఇప్పుడు ఆ విలువ‌ను రూ. 3,500 కోట్ల‌కు త‌గ్గించుకుంటూ వచ్చారు. న్యాయ‌ప‌రంగా ప్ర‌భుత్వ అరాచకాల‌ను ఎండ‌గ‌ట్టే ఏ అవ‌కాశాన్ని మేం వ‌దులుకోం. ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీస్తాం. కేసుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూనే ఉంటాం.డిస్టిల‌రీన్నీ చంద్ర‌బాబు అనుమ‌తుల‌తో ఏర్పాటైన‌వే:డిస్టిల‌రీల నుంచి క‌మీష‌న్లు తీసుకున్నార‌నేది సిట్ చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ. కానీ వాస్త‌వంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న డిస్టిల‌రీల‌న్నీ చంద్ర‌బాబు అనుమ‌తులిచ్చిన‌వే. వైయ‌స్సార్సీపీ హయాంలో ఒక్క దానికి కూడా అనుతివ్వ‌లేదు. కొంత‌మంది అధికారుల‌ను లోబ‌ర్చుకుని, బెదిరించి, భ‌య‌పెట్టి వారితో వాంగ్మూలాలు తీసుకుని కేసులు న‌మోదు చేశారు. లిక్క‌ర్ కుంభ‌కోణం జ‌రిగింద‌ని చెప్ప‌డానికి సిట్ వ‌ద్ద ఒక్క ఆధారం కూడా లేదు. ఏదోఒక విధంగా వైయ‌స్సార్సీపీని ఇబ్బంది పెట్టాల‌న్న ఉద్దేశ్యంతోనే క‌క్ష‌పూరితంగా లిక్క‌ర్ కేసును సృష్టించారు.రాష్ట్రంలో న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు:నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టేందుకు మా చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి బందోబ‌స్తు క‌ల్పించాల‌ని కోర్టు స్ప‌ష్టంగా చెప్పినా పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేదు. పోలీసులు య‌థేచ్చ‌గా చ‌ట్టాన్ని, న్యాయస్థానాల ఆదేశాల‌ను ఉల్లంఘిస్తున్నారు. అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి కూట‌మి నాయ‌కుల అరాచ‌కాల‌కు స‌హ‌క‌రిస్తున్న పోలీసులు, ప్ర‌భుత్వ అధికారులు రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దు. వైయ‌స్సార్సీపీని ఎంత అణ‌గ‌దొక్కాల‌ని చూస్తే అంత‌కు మూడింత‌లు బ‌లంగా తిర‌గ‌బ‌డ‌తాం. వైఎస్సార్‌సీపీ పోరాటాలు కొత్త‌కాదు. పార్టీ ఏర్పాటే తిరుగుబాటుతో మొద‌లైంది.ప‌వ‌న్ ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయారు:త‌న‌కు పాల‌న చేత‌కాద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే చెప్పేశాడు. ఏదైనా అల‌జ‌డి సృష్టించి వైఎస్సార్‌సీపీ మీద బుర‌ద జ‌ల్ల‌డానికే చంద్ర‌బాబు ఆయ‌న్ను వాడుకుంటున్నాడు. ఆయ‌న‌కున్న సినిమా క్రేజ్‌ని తెలుగుదేశం పార్టీ వాడుకుని మొన్న ఎన్నికల్లో ల‌బ్ధిపొందింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌లం, బ‌ల‌హీన‌త జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పూర్తిగా అర్థ‌మైంది. రాబోయే రోజుల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ జీరో కావ‌డం త‌థ్యం. వైఎస్సార్‌సీపీ హ‌యాంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్య‌మయ్యార‌ని, దానివెనుక వాలంటీర్ల పాత్ర ఉంద‌ని ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై మా ప్ర‌భుత్వ హ‌యాంలో న‌మోదైన కేసును కూట‌మి ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. దీనిపై క్రిమిన‌ల్ రివిజ‌న్ పిటిష‌న్ వేసి న్యాయ‌స్థానాల్లో పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

ENG VS IND 4th Test Day 2: England team in strong position3
ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు

టీమిండియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ అద్భుత అర్థ శతకాలతో చెలరేగారు. క్రాలీ 113 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 84 పరుగులు సాధించాడు. మరోవైపు, బెన్ డకెట్ సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 100 బంతులు ఎదుర్కొన్న అతడు ఏకంగా 13 బౌండరీలు బాది 94 పరుగులు సాధించాడు. భారత అరంగేట్ర పేసర్ అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కి క్యాచ్ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్ కు తెరపడింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన హోలీ పోప్, జో రూట్ నిలకడగా ఆడటంతో గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. కేవలం 46 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. పోప్ 20, జో రూట్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇక అంతకుముందు 264/4 ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట మొదలు పెట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) శుభారంభం అందించారు. వన్ డౌన్ బ్యాటర్ గా తిరిగి వచ్చిన సాయి సుదర్శన్ అర్థ శతకం (61) తో మెరిశాడు. కానీ, కెప్టెన్ శుభ్ మన్ గిల్ (12) మరోసారి విఫలం అయ్యాడు. ఇక తొలిరోజు 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్డ్ హార్ట్ గా క్రీజు వదిలిన రిషబ్ పంత్ రెండో రోజు బ్యాటింగ్ కు తిరిగి వచ్చాడు. అర్థ శతకం (54) పూర్తిచేసుకుని ఆర్చర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మిగతా వారిలో శార్దూల్ ఠాకూర్ (41) ఒక్కడే పరవాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్టు ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్ వోక్స్, లియాం డాసన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

WWE Great Hulk Hogan Dies At 71 Due To Cardiac Arrest Says Report4
WWF దిగ్గజం హల్క్‌ హోగన్‌ కన్నుమూత

దిగ్గజ రెజ్లర్‌, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ (ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ) సూపర్‌ స్టార్‌ హల్క్‌ హోగన్‌ (Hulk Hogan) (71) ఇవాళ (జులై 24) ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గల తన నివాసంలో హోగన్‌ తుది శ్వాస విడిచారని సమాచారం. కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా హోగన్‌ మృతి చెందినట్లు తెలుస్తుంది.1953 ఆగస్ట్‌ 11న జన్మించిన హోగన్‌ అసలు పేరు టెర్రి జీనీ బోల్లియా. 80వ దశకంలో హోగన్‌ డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ (WWF) ద్వారా విశేష ప్రజాదరణ పొందారు. హోగన్‌ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజిల్‌ మానియాలోని తొలి తొమ్మిది ఎడిషన్లలో ఎనిమిది టైటిళ్లు సాధించాడు.హోగన్‌కు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్‌ ఆఫ్‌ ఫేమర్లలో కూడా చోటు దక్కింది. 1984లో హోగన్‌ తన తొలి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. హోగన్‌ తన కెరీర్‌ ఉన్నతిలో ఆండ్రీ ద జెయింట్‌, మాఛో మ్యాన్‌ రాండీ సావేజ్‌, అల్టిమేట్‌ వారియర్‌ లాంటి దిగ్గజ రెజర్లతో కుస్తీ పడ్డాడు. హోగన్‌కు అతని మీసాలు చాలా ప్రత్యేకతనిచ్చాయి.హోగన్‌ రెజ్లింగ్ కాకుండా సినిమాలు, టీవీ రియాలిటీ షోల్లో కూడా నటించాడు. హోగన్‌ గడిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ తరఫున ప్రచారం చేశాడు. హోగన్‌కు భారత్‌లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. 80వ దశకంలో పిల్లలకు హోగన్‌ సుపరిచితుడు.

cracks in Telangana Secretariat building 5
తెలంగాణ సచివాలయంలో మరోసారి ఊడిపడ్డ పెచ్చులు

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి సీఎం రేవంత్‌ కాన్వాయ్‌ వచ్చే మార్గంలోనూ పెచ్చులు కూలాయి. పెచ్చులు ఊడి పడడంతో సచివాయం సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కాగా, గత వారం రోజుల నుంచి సచివాలయానికి సిబ్బంది రిపేర్లు చేస్తున్నారు. సచివాలయంలో పెచ్చులు ఊడి పడుతున్న ఘటనలపై సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ సచివాలయలో పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్‌ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి.. రామగుండం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది.ఘటనపై స్పందించిన సచివాలయ నిర్మాణ సంస్థసెక్రటేరియట్‌ పెచ్చులు ఊడిన ఘటనపై షాపూర్​జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ స్పందించింది. ‘‘ రెగ్యులర్ డిపార్ట్‌మెంట్‌ పనుల్లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేపట్టినట్లు పేర్కొంది. నిర్మాణం ప్రాబ్లం కాదని.. అది కాంక్రీట్ వర్క్ కాదని తెలిపింది. స్ట్రక్చర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఊడి పడింది జీఆర్‌సీ ఫ్రేం. ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్‌ఎసీ డ్రిల్ చేస్తున్నారు.. దీంతో జీఆర్‌సీ డ్యామేజ్ అవుతుంది. స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతోంది. ఎలాంటి నాణ్యత లోపం లేదు. మేము ఘటనపై రివ్యూ చేస్తున్నాం అని’’ ఆ సంస్థ వెల్లడించింది. తాజాగా, మరోసారి సచివాలయంలో పెచ్చులు ఊడడం చర్చాంశనీయంగా మారింది.

Russian plane carrying 50 passengers Missing Latest News Live Updates6
రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 43 మంది దుర్మరణం

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న అంగారా ఎయిర్‌లైన్స్‌ విమానం చైనా సరిహద్దులో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 43 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం.. సుమారు 43 మందితో(ప్రయాణికులు(ఐదుగురు చిన్నారులు సహా), సిబ్బంది) టిండా ఎయిర్‌పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది. అయితే గమ్యస్థానానికి కొద్దికిలోమీటర్ల దూరంలో ఉండగానే ఈస్ట్రన్‌ అమూర్‌ రీజియన్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో(ఏటీసీ) సంబంధాలు తెగిపోయింది. దీంతో విమానం అదృశ్యమైనట్లు ప్రకటించిన అధికారులు.. దాని ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయితే.. కాసేపటికే అమూర్‌ రీజియన్‌లోని దట్టమైన అడవుల్లో విమాన శకలాలను గుర్తించారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.🚨 JUST IN: Aerial footage shows the wreckage of the crashed An-24 in Russia’s Amur Region.Civil Defense confirms: no survivors found.The plane was carrying nearly 50 people.🎥👇 #Russia #PlaneCrash #An24 #Breaking pic.twitter.com/LyXWnBmRa9— Depin Bhat (@DepinBhat) July 24, 2025#BREAKING: Russian plane missing with about 50 people on board.the plane, operated by the Angara airline, was headed for the town of Tynda in the Amur region bordering China.#Russia #PlaneMIssing #AngaraAirline #An24 #China #RussianPlane #aviation #aviationnews pic.twitter.com/RQVKxlfKOM— upuknews (@upuknews1) July 24, 2025అంగారా ఎయిర్‌లైన్స్ (Angara Airlines) రష్యాలోని ఇర్కుట్స్క్ కేంద్రంగా పనిచేసే ప్రాంతీయ విమాన సంస్థ. ఇది 2000లో స్థాపించబడింది. అంగారా నది పేరు మీద ఎయిర్‌లైన్స్‌కు ఈ పేరు పెట్టారు. సైబీరియాతో పాటు రష్యాలోని ఇతర ప్రాంతాలకు ఈ విమానయాన సంస్థ నిత్యం రవాణా సేవలు అందిస్తోంది. అలాగే చైనాలోని మాంఝౌలి రీజియనకు కూడా సర్వీసులను నడుపుతోంది.దుర్ఘటనలు:2011: Flight 9007 – ఇన్-ఫ్లైట్ ఇంజిన్ ఫైర్ వల్ల ఒబీ నదిలో విమానం కూలి ఏడుగురు చనిపోయారు2019: Flight 200 – టేకాఫ్ తర్వాత ఇంజిన్ ఫెయిల్యూర్‌ జరిగి ఓ బిల్డింగ్‌ను ఢీకొని అగ్నిప్రమాదం సంభవించింది. ఇద్దరు సిబ్బంది ఈ ఘటనలో చనిపోయారు.2025, జులై 24న: ఏ24 ఫ్లయిట్‌- గమ్యస్థానానికి కొద్దికిలోమీటర్ల దూరంలో ఉండగా తెగిపోయిన సిగ్నల్స్‌.. కాసేపటికే ప్రమాదం.. విమానంలోని 43 మంది మరణించినట్లు తెలుస్తోంది.

Pawan Please Bring Back Kohinoor Diamond7
పవన్‌.. చేతనైతే ‘కోహినూర్‌​‍’ను వెనక్కి రప్పించు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్ర పోషించిన హరిహర వీరమల్లు చిత్రం ఇవాళ రిలీజ్‌ అయ్యింది. కోహినూర్‌ వజ్రం సీక్వెన్స్‌ ఈ చిత్ర కథలో భాగమని చిత్రయూనిట్‌ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. “ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్... దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి” అని పవన్‌ పేల్చిన డైలాగూ ఉంది. అయితే బ్రిటిషర్లు తీసుకెళ్లిన ఆ వజ్రాన్ని నిజంగానే వెనక్కి తేవాలంటూ పవన్‌కు ఓ లేఖ చేరింది ఇప్పుడు. కోహినూర్‌.. ఒక వజ్రం(Kohinoor Diamond) మాత్రమే కాదు. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఓ చిహ్నం కూడా. భారత్‌తో పాటు పాక్‌, అఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌ కూడా ఈ వజ్రం తమదేనంటూ వాదిస్తుంటాయి. చివరకు.. 1849లో లాహోర్‌ ఒప్పందం ప్రకారం బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా చేతికి వెళ్లింది. అక్కడి నుంచి క్వీన్‌ విక్టోరియా కిరీటంలో పొదిగారు. రాజకుటుంబంలో మగవాళ్లు కోహినూర్‌ను అరిష్టంగా భావించి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత లండన్‌ టవర్‌ జ్యువెల్స్‌ టవర్‌లో ప్రదర్శనగా ఉంటోంది. కోహినూర్‌ను భారత్‌కు రప్పించేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ విజ్ఞప్తులను ఇంగ్లండ్‌ తోసిపుచ్చుతూ వస్తోంది. క్వీన్‌ ఎలిజబెత్‌ 2 మరణం తర్వాత మరోసారి ఈ డిమాండ్‌ ఊపందుకుంది. 2025లో బ్రిటన్ మంత్రి లీసా నాండీ(Lisa Nandy) భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ చర్చ జోరుగా సాగింది. కోహినూర్‌ను ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు అంటూ కామెంట్‌ చేశారామె. అయితే భారత విదేశాంగ శాఖ మాత్రం సంతృప్తికర పరిష్కారం కోసం మార్గాల అన్వేషణ కొనసాగుతోందని అంటోంది. ఈ నేపథ్యంలో.. పవన్‌కు చేరిన లేఖలో అంశాలు ఇలా.. ‘‘మీరు ప్రముఖ పాత్రలో నటించి విడుదల చేసిన "హరిహర వీరమల్లు" చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు. కానీ మీ అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. అపోహలతో కూడిన ఈ ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీస్తుంది. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టు కథ ఆని మీరు ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నాను.బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ఫాంటసీ సృష్టి మాత్రమే. దీనితో ముడిపడి ఉన్న మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటివి వాస్తవాలు. వాస్తవాలకు కట్టు కథలను జోడించడంవల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి.కృష్ణానది పరివాహ ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం ఆనాడు (దాదాపు 700 సంవత్సరాల క్రితం) కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొగల్ చక్రవర్తులకు, వారి నుండి నాదిర్షాకు, వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు, వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు, అక్కడినుండి బ్రిటిష్ వారికి అది లభించింది.బ్రిటిష్‌వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదు. బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం. మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది. వారు భారతదేశంలో అంతర్భాగం అయిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది.యావన్మంది ప్రజలు ఒక్క తాటి పైకి వచ్చి పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్ళి పోయారు. ఈ చారిత్రిక వాస్తవాన్ని కూడా మీరు గుర్తించడం అవసరం.మీరు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు.కోహినూర్‌ డైమండ్‌.. మన వారసత్వ సంపద. ఆ పని చేయకుండా కట్టు కథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి, ప్రజలకు నష్టమని గుర్తించాలని కోరుతున్నాను’’ అంటూ పవన్‌ కల్యాణ్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఓ లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహినూర్‌ డైమండ్‌ కథాంశంగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కావడం గమనార్హం.VIDEO | Andhra Pradesh Deputy CM Pawan Kalyan (@PawanKalyan ) says, "The Kohinoor should definitely be brought back to India. I personally feel it belongs to our nation, it is the property of Bharat. That is our heart and soul, that is our Ratnagarbha. I think it should be… pic.twitter.com/sPZHjsBJjM— Press Trust of India (@PTI_News) July 22, 2025

Another Bengaluru tale: Man Filmed Women on Roads Arrested8
పెదాలు కొరికి.. వీడియోలు తీసి.. కటకటాల్లోకి కామపిశాచులు

ఐటీ మహా నగరం బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు కామపిశాచులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రహస్యంగా అమ్మాయిలను చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ డెలివరీ ఏజెంట్‌ను(19), అలాగే ఓ మహిళ పెదాలను కొరికి పారిపోయిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. మణిపూర్‌కు చెందిన దిలావర్‌ హుస్సేన్‌.. బెంగళూరులో డెలివరీ ఏజెంట్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొత్తనూరులోని బైరాతిలో అద్దెకు గది తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే సాయంత్రం కాగానే నగరంలోని ఎంజీరోడ్డు, చర్చ్ స్ట్రీట్, కొరమంగల ప్రాంతాల్లో అమ్మాయిలను రహస్యంగా ఫోన్‌లో చిత్రీకరించడం ప్రారంభించాడు. అలా ఆ అశ్లీల ఫొటోలను, వీడియోలను బెంగళూర నైట్‌ లైఫ్‌ అనే ట్యాగుతో తన దిల్‌బర్‌ జానీ-67 పేజీలో అప్‌లోడ్‌ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో.. సోషల్‌ మీడియాలో అశ్లీల పేజీలు పెరిగిపోతుండడంపై దృష్టిసారించిన అశోక్‌ నగర్‌ పోలీసులకు దిలావర్‌ పేజీ కంటపడింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ తరహా కంటెంట్‌ చిత్రీకరించి.. నెట్టింట వైరల్‌ చేసినందుకు అతన్ని అరెస్ట్‌ చేశారు. మహిళల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా వీడియోలు తీసినందుకు బీఎన్‌ఎస్‌తో పాటు ఐటీ సెక్షన్లు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. బెంగళూరులో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. మే చివరి వారంలో.. బెంగళూరు మెట్రో రైళ్లలో యువతులను అసభ్యకర రీతిలో ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. జులై మొదటి వారంలో.. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీ బాత్రూంలో మహిళా ఉద్యోగిణిని రహస్యంగా చిత్రీకరించబోయి ఓ సీనియర్‌ అసోషియేట్‌ జైలు పాలయ్యాడు. ఇక.. రెండు వారాల కిందట గురుదీప్‌ సింగ్‌ అనే వ్యక్తి రోడ్ల మీద మహిళలను తన ఫోన్‌లో బంధించే ప్రయత్నంలో ఓ యువతి చేతికి చిక్కి చెప్పు దెబ్బలు తిని.. ఆపై జైలు పాలయ్యాడు. తాజాగా మరో ఘటనలో.. గోవిందపూర్‌లో ఓ యువతిని లైంగికంగా వేధించిన వ్యక్తి.. ఆమె పెదాలను కొరికి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని మరూఫ్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు. జూన్‌ 6వ తేదీన బెంగళూరు కూక్‌ టౌన్‌ మిల‍్టన్‌ పార్క్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిని మహిళను అసభ్యంగా తాకి.. ఆపై పార్క్‌లో ఆమె వెంటపడి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. అంతకు ముందు.. ఏప్రిల్‌ 3వ తేదీన బీటీఎం లేఅవుట్‌లోనూ ఇదే తరహాలో ఓ ఘటన జరిగంది. ఓ వ్యక్తి ఇద్దరు యువతుల్ని వెంబడించి.. వాళ్లను అసభ్యంగా తాకి అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

Reddit users Rs 75L job offer sparks debate on high income tax burden in India9
రూ.75 లక్షల జాబ్ ఆఫర్.. తీసుకోవాలా.. వద్దా?

ఎక్కువ జీతం వచ్చే జాబ్‌ ఆఫర్‌ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏడాదికి రూ.75 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ వచ్చింది.. తీసుకోవాలా.. వద్దా అని సందిగ్ధంలో ఉన్నానని ఇటీవల ఓ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతదేశంలో అధిక పన్ను కారణంగా ఈ ఆఫర్‌ను తాను స్వీకరిస్తానని ఖచ్చితంగా చెప్పలేనన్నారు.తాను ఇప్పటికే దాదాపు రూ.12 లక్షల పన్నులు చెల్లిస్తున్నానని, కొత్త జాబ్‌ ఆఫర్ స్వీకరిస్తే ఆ పన్ను మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ.22 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. ‘20 ఏళ్ల అనుభవంతో ప్రస్తుతం భారత్ లో ఏటా రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. ఈ మధ్యనే రూ.75 లక్షలకు ఆఫర్ వచ్చింది. ఇది గణనీయమైన పెరుగుదల అయినప్పటికీ, ప్రధానంగా పన్ను బాధ్యతలో విపరీతమైన పెరుగుదల కారణంగా దానిని అంగీకరించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం రూ.12 లక్షల వరకు పన్నులు చెల్లిస్తున్నాను. రూ .50 లక్షలకు పైగా ఆదాయంపై వర్తించే అదనపు 10% సర్‌ఛార్జ్ కారణంగా కొత్త ఆఫర్‌తో ఆ మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ .22 లక్షలకు చేరుకుంటుంది" అని యూజర్ రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు.ట్యాక్స్‌ ఎక్కువ కట్టేందుకు పనిచేయాలా?కొత్త వేతన నిర్మాణంలో పన్ను ఆదా చేసే అంశాలను చేర్చే వెసులుబాటు లేదని ఆయన అన్నారు. ‘కాబట్టి, నా టేక్-హోమ్ వేతనం సుమారు 50% పెరగవచ్చు, పన్ను భారం దాదాపు రెట్టింపు అవుతుంది. తక్కువ పన్ను లేదా అస్సలు చెల్లించని వారితో పోలిస్తే ఎటువంటి అదనపు స్పష్టమైన ప్రయోజనాలను పొందకుండా, ప్రభుత్వానికి ఎక్కువ పన్ను చెల్లించడానికి నేను ఎందుకు ఎక్కువగా కష్టపడాలి?" అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సదరు వ్యక్తికి వచ్చిన సందిగ్ధ పరిస్థితిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తూనే అభిప్రాయాలనూ వ్యక్తీకరించారు. నేరుగా ఉద్యోగంలో చేరకుండా కన్సల్టెంట్ గా పరిహారం అందుకుంటే పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకోవచ్చని, కానీ ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్‌ చెల్లించడం ఇష్టం లేక వేతన పెంపు తీసుకోకపోవడం సరికాదంటూ ఓ యూజర్‌ సలహా ఇచ్చారు. ఇప్పుడొస్తున్న దానికంటే 50% ఎక్కువ జీతం వస్తున్నా కూడా ట్యాక్స్‌ పెరుగుతుంది కాబట్టి జాబ్‌ ఆఫర్‌ను వదులుకుంటాననడం మూర్ఖత్వం అని మరో వ్యక్తి పేర్కొన్నారు.దేశంలో ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ .4 లక్షల వరకు ఆదాయంపై సున్నా పన్ను ఆ తర్వాత 5% నుండి 30% వరకు పన్ను రేట్లు ఉ‍న్నాయి. ఇంకా చెప్పాలంటే రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు (వేతన జీవులకు రూ.12.75 లక్షలు) అధిక రిబేట్, స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పాత విధానం ఎంచుకునేవారికి 80సీ, హెచ్ఆర్ఏ వంటి సెక్షన్ల కింద మినహాయింపులు ఉన్నాయి. అధిక ఆదాయం ఉన్న వ్యక్తులకు సర్ ఛార్జీలు వర్తిస్తాయి.👉 ఇదీ చదవండి: ఐటీ రిటర్న్‌ కొత్త డెడ్‌లైన్‌.. మిస్‌ అయితే పెద్ద తలనొప్పే!

ENG VS IND 4th Test: Pant Became The Highest Run Scorer For India In WTC History10
గాయాన్ని సైతం లెక్క చేయకుండా ఆడి చరిత్ర సృష్టించిన రిషబ్‌ పంత్‌

మాంచెస్టర్‌ టెస్ట్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో గాయాన్ని సైతం​ లెక్క చేయకుండా బరిలోకి దిగిన పంత్‌.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు (67 ఇన్నింగ్స్‌ల్లో 2719 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు ఇంతకుముందు రోహిత్‌ శర్మ (69 ఇన్నింగ్స్‌ల్లో 2716 పరుగులు) పేరిట ఉండేది. పంత్‌ తాజాగా హిట్‌మ్యాన్‌ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ మ్యాచ్‌లో పంత్‌ 54 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో 37 పరుగుల వద్ద రిటైర్డ్‌ హర్ట్‌ అయిన పంత్‌.. మరో 17 పరుగులు జోడించి పెవిలియన్‌కు చేరాడు. బొటన వేలు గాయంతో బాధపడుతూనే పంత్‌ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పంత్‌ వీరోచిత పోరాటానికి అందరూ సలాం​ కొడుతున్నారు. పంత్‌ హాఫ్‌ సెంచరీకి చేరువలో జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో బాదిన ఓ సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఈ సిక్సర్‌తో పంత్‌ భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్‌ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం పంత్‌, సెహ్వాగ్‌ టెస్ట్‌ల్లో తలో 90 సిక్సర్లతో ఉన్నారు.హాఫ్‌ సెంచరీ పూర్తి కాగానే పంత్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. పంత్‌ ఔటయ్యాక భారత్‌ ఇన్నింగ్స్‌ కొద్ది క్షణాల్లోనే ముగిసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసింది.భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రిషబ్‌ పంత్‌ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, అన్షుల్‌ కంబోజ్‌ 0, జస్ప్రీత్‌ బుమ్రా 5, మహ్మద్‌ సిరాజ్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 5, ఆర్చర్‌ 3, వోక్స్‌ డాసన్‌ తలో వికెట్‌ తీశారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement