
● ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు సబర్బన్: నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే, బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం స్థానిక పాత గుంటూరు రోడ్డులోని రవి ప్రియ మాల్ పక్కన నూతనంగా నిర్మించిన ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బాలినేని ప్రజలకు అంకితం చేశారు. ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలోని 33/11 ఇండోర్ సబ్‌స్టేషన్ నగరంలో ఇదే మొట్టమొదటిది కావటం విశేషం. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూ.6.50 కోట్లతో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కేవీజి.సత్యన్నారాయణ, నగర మేయర్ గంగాడ సుజాత, రవి ప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్, ఈఈలు పి.శ్రీనివాసులు, కట్టా వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ రెడ్డి, డీఈఈ వినయ్‌కుమార్‌రెడ్డి, అంజిరెడ్డి, రమేష్, శివప్రసాదు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment