ప్రకాశం: కొండపికి చెందిన మామిళ్లపల్లి హాసిని గురువారం విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్‌లో కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికై నట్లు ఆమె తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆమె ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల ఐటీడీఏలో అసిస్టెంట్ ట్త్రెబల్ సంక్షేమ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె తమ్ముడు శ్రావణ్‌కుమార్ పొన్నలూరు మండల తహసీల్దార్‌గా, తండ్రి వెంకటేశ్వర్లు కొండపి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి గ్రూప్–1 అధికారిగా ఎంపికవడంపై హాసినిని అభినందిస్తున్నారు.
ఒంగోలు టౌన్: ఏపీపీఎస్పీ ఫలితాల్లో ఒంగోలుకు చెందిన ఓ.వసంత గ్రూప్ వన్ కేటగిరిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్‌మెంట్‌కు ఎంపికయ్యారు. వసంత తండ్రి ఓ.దుర్గా ప్రసాద్ ఒంగోలు స్పెషల్ బ్రాంచి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి సుజాత గృహిణి. వసంత ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివారు.
Comments
Please login to add a commentAdd a comment