
స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై సమావేశం నిర్వహిస్తున్న ఆర్‌డీఓ విశ్వేశ్వరరావు
ఒంగోలు అర్బన్: స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో భాగంగా డిసెంబర్ 2,3 తేదీల్లో ఓటరు జాబితా సవరణపై ప్రజలకు అందుబాటులో సేవలందించేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఒంగోలు ఆర్‌డీఓ విశ్వేశ్వరరావు తెలిపారు. మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని 259 పోలింగ్ కేంద్రాల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ అజిత, డీటీ అర్జున్‌రెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఒంగోలు డీటీ రఫీ, వైఎస్సార్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, స్వరూప్, రాజశేఖర్, సత్యం, రసూల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment