హైవే దొంగతనాలపై ఎస్పీ సీరియస్
ఒంగోలు టౌన్: హైవేల వెంట నిలిపి ఉంచిన లారీల నుంచి డీజిల్ దొంగిలిస్తున్న ముఠాల గురించి ‘హైవేలపై కేడీలు’ అనే శీర్షికతో సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పందించారు. హైవేలపై దీర్ఘకాలంగా పనిచేస్తున్న హైవే పోలీసులను ఆ విధుల నుంచి తొలగించి వారి స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు. మంగళవారం ఉదయం జరిగిన సెట్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన జిల్లాలో హైవేల వెంట ఉన్న పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. హైవేలపై ఇన్ని చోరీలు జరుగుతుంటే మీరేమి చేస్తున్నారని మండిపడినట్లు తెలిసింది. ఎలాంటి అవకతవకలకు పాల్పడినట్లు తెలిసినా శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే ఎస్పీ కొంత సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దొంగ డీజిల్ విక్రయాలకు పాల్పడుతున్న వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఒక ఎస్‌ఐ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడంతో అతడిపై చర్యకు సమాయత్తం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఛేంజ్ ద డెన్...
ఇదిలా ఉండగా సాక్షిలో కథనం ప్రచురితమైన వెంటనే సోమవారం ఉదయం ఒంగోలు సమీపంలోని ఒక కళ్యాణ మండపం పక్కన ఉన్న డెన్‌ను పోలీసులు దగ్గర ఉండి మరీ తొలగించినట్లు సమాచారం. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు పాకను తొలగించివేశారు. అయితే హైవే దొంగల వద్ద నుంచి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేసి విక్రయించే వ్యాపారి తన డెన్‌ను ఉలవపాడుకు మార్చినట్లు తెలుస్తోంది. అతడొక్కడే కాకుండా జిల్లాలో దొంగ డిజిల్ విక్రయిస్తున్న దాబా నిర్వాహకులు కూడా సరుకును ఎక్కడికక్కడ సర్దేసినట్లు సమాచారం. నగరంలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో దొంగలు తీసుకొచ్చిన జాకీలు, బ్యాటరీలను కొనుగోలు చేసే వ్యాపారులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు తమ డెన్‌లను సేఫ్ జోన్‌కు మార్చినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఈ విషయాన్ని ఎస్పీ సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు, దొంగ డీజిల్ విక్రేతల గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి. ఇన్నాళ్లు దాబాల్లో ఉచితంగా బిర్యానీలు తింటూ, మూడు డీజిల్ క్యానులు, ఆరు బ్యాటరీల చందంగా రెండు చేతులా సంపాదించిన కొందరు పోలీసులు ఎవరి మీద దెబ్బ పడుతుందోనని ఆందోళన చెందుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
హైవే సిబ్బందిని తొలగించి కొత్త వారికి బాధ్యతల అప్పగింత హైవే పోలీసు స్టేషన్ సమీపంలోని పోలీసులకు హెచ్చరికలు చోరీలపై విచారించి నివేదిక ఇవ్వాలని సీసీఎస్ సిబ్బందికి ఆదేశాలు
హైవే దొంగతనాలపై ఎస్పీ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment