నగరంలో అనేక ఇళ్లకు పన్నులు వేయడం లేదని, అన్నీ ఇళ్లకు పన్నులు వేసి వసూలు చేయడం ద్వారా ఆదాయం వస్తుందని ఒక సభ్యుడు సూచించారు. నగరంలో అనేక ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటన్నింటిపై పన్నులు వేస్తే సుమారు రూ.10 కోట్ల వరకు ఆదాయం వస్తుందని మరో సభ్యుడు సలహా ఇచ్చారు. బడ్జెట్ సమావేశంలో అధికార పార్టీ సభ్యులంతా దాదాపుగా ప్రజలపై పన్నులు వేయడం గురించే సూచనలు, సలహాలు ఇచ్చారు. వచ్చే నెల తర్వాత ఖాళీ స్థలాలపై పన్నులు వేసేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. ఈ మొత్తం చర్చలో ప్రజల నుంచి ముక్కు పిండి కొత్త కొత్త పన్నులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న అంశం స్పష్టమవుతోంది. ఇక ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ (ఒడా) నుంచి కూడా రూ.10 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇప్పటికే ఒడా పేరుతో అపార్ట్‌మెంట్ యజమానుల నుంచి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ రూ.10 కోట్ల పన్నులు వేస్తే వారు భయంతో పారిపోవడం ఒక్కటే మిగులుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment