బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలి
● పౌల్ట్రీ ఫామ్స్‌ను తనిఖీ చేసిన జేడీ కే బేబిరాణి
కొత్తపట్నం: కోళ్లకు వచ్చే బర్డ్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.బేబిరాణి అన్నారు. మండలంలోని ఈతముక్కల గ్రామంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్స్‌ను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యజమానులతో మాట్లాడుతూ కోళ్ల మరణాలపై ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. పక్షుల అసహజ మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలకు స్థానిక పశుసంవర్థక శాఖ వారికి తెలియజేయాలన్నారు. సందేహాస్పదంగా చనిపోయిన పక్షులను ముట్టుకోకూడదని వివరించారు. వాటిని తినకూడదని, దూరంగా పూడ్చిపెట్టాలని తెలిపారు. వ్యాధి సోకినట్టుగా అనుమానమున్న పక్షులను వేరు చేయాలని, తగిన పరీక్షలు చేయించాలని తెలిపారు. పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసేవారు చేతులు సబ్బుతో కడుక్కోవడం, ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరిగా చేయాలన్నారు. పశుసంవర్థక శాఖ సలహా తీసుకుని అవసరమైన టీకాలు వేయించాలన్నారు. అస్వస్థత, జ్వరం, శ్యాస సమస్యలు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. స్థానికంగా రైతులతో మాట్లాడుతూ బాగా ఉడికించిన కోడి మాంసం, కోడి గుడ్లుని తినవచ్చున్నారు. ఎలాంటి అపోహలకు లోనవ్వకూడదని వివరించారు. కార్యక్రమంలో కొత్తపట్నం పశువైద్యాధికారిని టి.అనూషా, రైతులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment