వైవీని పరామర్శించిన బూచేపల్లి
ఒంగోలు సిటీ: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలులోని ఆయన నివాసానికి వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మృతి చెందిన నేపథ్యంలో వై.వి.సుబ్బారెడ్డి, వై.వి.భద్రారెడ్డి ని పరామర్శించారు.
పసుపు పంటను పరిశీలించిన ఉద్యానవన శాఖాధికారిణి
కంభం: దిగుబడులు తగ్గి ధరలు లేక పసుపు రైతులు నష్టపోతున్న నేపథ్యంలో ఆదివారం ‘సాక్షి’ దినపత్రిక లో ‘ప్రకాశించని పసుపు’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఉద్యానవనశాఖ అధికారులు ఆదివారం పసుపు రైతులను కలసి వివరాలు సేకరించారు. ఉద్యానవన శాఖాధికారిణి శ్వేత మాట్లాడుతూ పసుపు రైతులు దిగుబడులు తగ్గాయని చెబుతున్నారని, ప్రస్తుతం ధరలు కూడా సగానికి పడిపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపినట్లు ఆమె చెప్పారు. పసుపు రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. గతేడాది క్వింటా ఎండు పసుపు ధర రూ.13 వేలు ఉంటే ప్రస్తుతం రూ.7 వేలకు పడిపోయిందని రైతులను ఆదుకోవాలని ఉద్యానవన శాఖాధికారిణి రైతులు కోరారు.
టోల్‌ప్లాజా సిబ్బందికి అస్వస్థత
● కాలం చెల్లిన గ్లూకోప్లస్– సీ ఇచ్చిన ఎక్స్‌ప్రెస్‌వే అధికారులు
టంగుటూరు: తక్కువ జీతాలకు వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీసం సరైన సదుపాయాలు అందించాల్సిన సింహపురి ఎక్స్‌ప్రెస్ వే అధికారులు రెండు రోజుల క్రితం ఇచ్చిన గ్లూకోప్లస్–సీ తాగిన టోల్‌ప్లాజా సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టోల్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో వేడిమి బారిన పడకుండా ఎక్స్‌ప్రెస్ వే అధికారులు గ్లూకోప్లస్–సీ అందిస్తున్న సమయంలో ఒకరు అది కాలం చెల్లిందని గమనించి అధికారులకు తెలిపాడు. అయితే అప్పటికే కొంత మంది తాగగా 10 మందికి కడుపులో తీవ్ర నొప్పి రావటంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
అయితే టోల్ ప్లాజా అధికారులు మాత్రం జరిగిన సంఘటన బయటకు పొక్కకుండా సిబ్బంది నోరు నొక్కారు. దీంతో సిబ్బంది తాము చూశాము కాబట్టి బయటపడిందని, ఇలా కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఎన్నిసార్లు ఇచ్చారో తెలియడం లేదని వాపోయారు. ఇప్పటికై నా జిల్లా ఆరోగ్య అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.
వైవీని పరామర్శించిన బూచేపల్లి
వైవీని పరామర్శించిన బూచేపల్లి


