సహకారం
అల్లాహ్ చూపిన మార్గం..
సమభావం..
నెల రోజుల కఠోర ఉపవాస దీక్షను ఆచరించిన ముస్లింలు రంజాన్(ఈద్ ఉల్ ఫిత్ర్) వేడుకలను సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి, ముక్కు పుటాలు గుభాళించే అత్తరు చల్లుకుని, కళ్లకు సుర్మా పెట్టుకుని మసీదులకు చేరుకున్న ముస్లింలు.. తదనంతరం తక్బీర్ పఠిస్తూ ఈద్గాల వద్దకు ర్యాలీగా బయలుదేరారు. పూర్వీకుల సమాధులపై పూలు చల్లి ప్రార్థనలు చేశారు. సామూహిక నమాజ్ ఆచరించి, పరస్పర ఆలింగనాలతో రంజాన్ ముబారక్ చెప్పుకొన్నారు. పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ పేర్కొన్న సూక్తుల సారాంశాన్ని ముస్లిం మత పెద్దలు వివరించారు. ముస్లింలు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో నడుస్తూ.. సమాజంలో సమభావం నెలకొల్పేందుకు, పేదలు సంతోషంగా జీవించేందుకు సహకారం అందించాలని ఉద్బోధించారు. రంజాన్ సందర్భంగా జిల్లాలో మత సామరస్యం వెల్లివిరిసింది.
ఒంగోలులో ఈద్ ముబారక్ చెప్పుకొంటున్న చిన్నారులు
– సాక్షి నెట్‌వర్క్
సహకారం
సహకారం
సహకారం
సహకారం
సహకారం
సహకారం
సహకారం
సహకారం
సహకారం
సహకారం
సహకారం


