సాగు కదలక! | - | Sakshi
Sakshi News home page

సాగు కదలక!

Apr 4 2025 1:03 AM | Updated on Apr 4 2025 1:05 AM

సాగు

సాగు కదలక!

సాయమందక..

మార్కాపురం: జిల్లాలో 2024–25 సంవత్సరంలో ఖరీఫ్‌ సాగు లక్ష్యం 2,02,249 హెక్టార్లు. సుమారు 1.7 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. రబీ సీజన్‌లో సాధారణంగా 3,97,880 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేయాల్సి ఉంది. అయితే, కేవలం 2,99,331 ఎకరాల్లో మాత్రమే సాగైంది. వేసిన పంటల్లో కూడా దాదాపు లక్షకుపైగా ఎకరాల్లో నిలువునా ఎండిపోయాయి. మిగతా 1.99 లక్షల ఎకరాల్లో కూడా సగానికిపైగా ఎకరాల్లో దిగుబడి మరీ దారుణంగా పడిపోయింది. దీంతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో కురిసిన అకాల వర్షాలకు జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంతక ముందు ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో కురిసిన వర్షాలకు సైతం పంటనష్టం భారీగా ఉంది. గతేడాది ఖరీఫ్‌ నుంచి పరిహారం కోసం అన్నదాతలు ఎదురుచూస్తూనే ఉన్నారు.

నేడు కూటమి ప్రభుత్వంలో...

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటుతున్నా నేటికీ ఏ ఒక్క రైతుకూ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందలేదు. దీంతో రైతులంతా పెట్టుబడుల కోసం 2019కి పూర్వం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించినట్లుగా మళ్లీ వారి వద్దకే వెళ్తున్నారు. ఈ ఏడాది కేవలం పీఎం కిసాన్‌ నిధి కింద మాత్రమే రైతులకు రూ.2 వేల నగదు బ్యాంకు ఖాతాల్లో జమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. చివరకు గతేడాది రెండు సీజన్లకు సంబంధించిన పంట నష్టపరిహారం కూడా ఎగ్గొట్టడంతో కూటమి ప్రభుత్వ తీరుపై అన్నదాతలు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఖరీఫ్‌, రబీ సీజన్లలో అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. కానీ, నేటికీ కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు నష్టపరిహారం అందలేదు. వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రబీ పంటలకు నష్టపరిహారం ఎప్పుడో..?

2023–24 రబీ సీజన్‌లో మార్కాపురం డివిజన్‌లో మిర్చి, పత్తి, అపరాలు, తదితర పంటలను రైతులు అధికంగా సాగుచేశారు. 2023 నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పొలాల్లో నీళ్లు నిలిచి పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, మిర్చి పంటలకు ఊహించని తెగుళ్లు వచ్చి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. తెగుళ్ల నివారణ కోసం రైతులు వేలాది రూపాయలు కూడా ఖర్చు చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. ముఖ్యంగా మినుము, కంది, సజ్జ, పొద్దు తిరుగుడు, ఆముదం, నూగు, జొన్న తదితర పంటలు బాగా దెబ్బతిన్నాయి. అయితే, గతేడాది మార్చిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతేడాది జూన్‌ 20 వ తేదీ కేంద్ర కరువు బృందం మార్కాపురం ప్రాంతంలో పర్యటించింది. ఈ బృందంలో ఎంఅండ్‌ఏ డైరెక్టర్‌ మన్నుజీ ఉపాధ్యాయ, కేంద్ర పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌ఈ కశ్యప్‌, న్యూఢిల్లీకి చెందిన ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిపార్ట్‌మెంటు డిప్యూటీ డైరెక్టర్‌ మదన్‌మోహన్‌ మౌర్య, నీతిఆయోగ్‌ సీనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌ అనూరాధ బట్నాతో పాటు జిల్లా అధికారులు, స్థానిక అధికారులు ఉన్నారు. ముందుగా వేములకోట చెరువును పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపారు. కానీ, నేటికీ రైతులకు పంట నష్టపరిహారం మాత్రం అందలేదు.

రైతులకు పంట నష్టపరిహారం చెల్లించకుండా చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం రెండు పంట సీజన్లు దాటినా అందని పరిహారం గతేడాది ఖరీఫ్‌ నుంచి ఎదురుచూస్తున్న రైతాంగం మార్కాపురం డివిజన్లోనే 5,940 మంది రైతులకు రూ.4.65 కోట్లు అందాల్సిన వైనం వ్యవసాయానికి సాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం అన్నదాతల్లో తీవ్ర నైరాశ్యం కనీవినీ ఎరుగని రీతిలో పథకాలు అందించిన గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

రైతులకు పంట నష్టపరిహారం అందించాలి

మార్కాపురం నియోజకవర్గంలో పలు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. కానీ, పంట నష్టపోయిన రైతులకు మాత్రం పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరువు ప్రాంతాలుగా ప్రకటించిన దృష్ట్యా గతేడాది రబీలో సాగుచేసి నష్టపోయిన పంటలకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. రైతుల రుణాలు మాఫీ చేయాలి. – బాలనాగయ్య, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు

సాగు కదలక!1
1/1

సాగు కదలక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement