రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వృద్ధుడి మృతి
ఒంగోలు టౌన్: రైల్వే ప్లాట్ ఫారం మీద గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..రైల్వే స్టేషన్‌లోని మొదటి ప్లాట్ ఫారం మీద 60 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వృద్ధుడు గురువారం మరణించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో వృద్ధుడు మరణించి ఉండటం గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. లేత ఆకుపచ్చ రంగు చొక్కాపై బులుగు, నలుపు రంగు చారల, నలుపు తెలుపు రంగు లుంగీ ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు ఒంగోలు రైల్వే ఎస్‌ఐ ఫోన్ నెంబర్ 9440627647కు తెలియజేయాలని ఎస్సై అరుణ కుమారి కోరారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
టంగుటూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..స్థానిక టోల్‌ప్లాజా సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్ర రక్తగాయాలై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు శరీరంపై తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని 40 ఏళ్ల వయసుంటుందని, ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తిస్తే 9121102137, 9121102135 నంబర్లకు సంప్రదించాలని ఎస్సై నాగమళ్లీశ్వరరావు తెలిపారు.
నిందితునికి రెండేళ్ల జైలు
● లారీని నిర్లక్ష్యంగా నడిపి ముగ్గురు మరణానికి కారణమైన కేసులో..
చీమకుర్తి: లారీని నిర్లక్ష్యంగా నడిపి ముగ్గురు మరణానికి కారణమైన లారీ డ్రైవర్ ముత్తు పాండియన్ రంగస్వామికి ఒంగోలు కోర్టు రెండు సంవత్సరాల 3 నెలల జైలుశిక్ష, రూ.5,500 జరిమానా విధించింది. ఒంగోలు స్పెషల్ ఎకై ్సజ్ కోర్టు జడ్జి ఎస్ కోమలవల్లి గురువారం తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...2019 జూన్ 8న చీమకుర్తిలోని గంగవరం రోడ్డులో ముగ్గురు వ్యక్తులు బైకుపై పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ కొట్టించుకొని వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చీమకుర్తి క్రిష్టియన్‌పాలెం, అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మందా రాకేష్, మట్టిగుంట రాకేష్, ఆత్మకూరి మహేష్ ముగ్గురు మరణించారు. పి.నాగరాజు ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో నిర్లక్ష్యంగా లారీని నడిపి ముగ్గురు మరణానికి కారణమైన లారీ డ్రైవర్‌కు శిక్ష పడటంతో సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వహించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వృద్ధుడి మృతి


