మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డికి బెయిల్‌ | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డికి బెయిల్‌

Apr 6 2025 1:28 AM | Updated on Apr 6 2025 1:28 AM

మాజీ

మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డికి బెయిల్‌

యర్రగొండపాలెం: త్రిపురాంతకం ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నాయకుల పన్నిన కుట్రకు బలై అక్రమ కేసులతో జైలుకెళ్లిన త్రిపురాంతకం మండల వైఎస్సార్‌ సీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుడు ఆళ్ల ఆంజనేయరెడ్డికి శనివారం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మండల పరిషత్‌ ఉప ఎన్నికలో ఎంపీపీగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న ఆయన్ను తప్పించేందుకు కూటమి నాయకుడి పావులు కదిపిన విషయం జిల్లా ప్రజలకు తెలిసిందే. ఆయన ఆదేశాలతో గత నెల 23న ఆంజనేయరెడ్డిపై పోలీసులు అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు బనాయించి అరెస్టు చేశారు. ఈ మేరకు కోర్టు ఆంజనేయరెడ్డిని రిమాండ్‌కు పంపింది. ఎటువంటి సాక్షాధారాలు లేకుండా పోలీసులు పెట్టిన అక్రమ కేసులను సవాల్‌ చేస్తూ ఆంజనేయరెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను పరిశీలించి ఆంజనేయరెడ్డికి బెయిల్‌ మంజూరు చేశారు.

రైలు కిందపడి వ్యక్తి మృతి

మార్కాపురం టౌన్‌: రైలు కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం మార్కాపురం రైల్వేస్టేషన్‌ ఔటర్‌ సిగ్నల్‌ వద్ద జరిగినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ హరికృష్ణారెడ్డి తెలిపారు. మార్కాపురం మండలం పెద్దయాచవరం గ్రామానికి చెందిన వై.అల్లూరయ్య (55) శనివారం ఉదయం 10 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో ఔటర్‌ సిగ్నల్‌ వద్ద పట్టాల పక్కన చనిపోయి కనిపించాడు. మతిస్థిమితం లేక పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు హరికృష్ణారెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆడుకుంటూ..అనంత లోకాలకు!

మార్కాపురం: గుర్తుతెలియని కారు ఢీకొని బాలుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని తిప్పాయిపాలెంలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కోడే వెంకటేశ్వర్లు, కుమారిల కుమారుడు కోడే శివకాశి (10) ఆడుకుంటూ రోడ్డు దాటుతుండగా మార్కాపురం నుంచి కంభం వైపునకు వెళ్తున్న గుర్తుతెలియని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు వెంటనే హుటాహుటిన శివకాశిని కంభం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు కంభంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. కుమారుని మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రోదించారు. అప్పటి వరకూ ఇంట్లో తమతో మాట్లాడి ఆడుతూ..పాడుతూ.. నిముషాల వ్యవధిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రూరల్‌ ఎస్సై అంకమరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్‌ హైవేపై ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డికి బెయిల్‌ 1
1/2

మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డికి బెయిల్‌

మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డికి బెయిల్‌ 2
2/2

మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డికి బెయిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement