ఉక్కిరిబిక్కిరి! | - | Sakshi
Sakshi News home page

ఉక్కిరిబిక్కిరి!

Apr 8 2025 7:45 AM | Updated on Apr 8 2025 7:45 AM

ఉక్కి

ఉక్కిరిబిక్కిరి!

రియల్‌

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తొలి సంవత్సరమే జిల్లాలో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం రూ.171 కోట్లు నష్టపోయింది. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.502.58 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం టార్గెట్‌ విధించింది. కానీ వచ్చింది కేవలం రూ.331.23 కోట్లు మాత్రమే. సాధారణంగా గత ఏడాది వచ్చిన నికర ఆదాయాన్ని బట్టి ఈ ఏడాది టార్గెట్‌ నిర్ణయిస్తారు. దాని ప్రకారమే ఈ ఏడాది రూ.502.58 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ గత ఏడాది వచ్చినంత కూడా రాకపోవడాన్ని బట్టి స్థిరాస్తి విక్రయాలు ఏ స్థాయికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. భూముల విలువ పెంచినా లక్ష్యాన్ని చేరుకోలేదు. రాబడిని పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. జిల్లా కేంద్రం ఒంగోలులో ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతుంది. 2024–25 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యం రూ.181.50 కోట్లు కాగా రూ.120.87 కోట్లు మాత్రమే వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. భూముల, స్థిరాస్తుల క్రయ, విక్రయాలు పడిపోవడంతో ఈ రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పులు చేసి వ్యాపారం చేసిన వారు ఆత్మహత్యలే శరణ్యం అంటూ వాపోతున్నారు.

ప్రజల ఆదాయం తగ్గిపోవడమే:

ప్రజల ఆదాయ మార్గాలు పడిపోవడంతో స్థిరాస్తి లావాదేవీలు మందగించాయి. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమలు క్యూ కడుతున్నాయంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా చేసే ప్రచారమంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని స్తిరాస్థి లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి. వాళ్లు చెప్పే మాటల్లో కొంతైనా నిజం ఉంటే స్థిరాస్తి లావాదేవీలు పెరగాలి. లేదా కనీసం గతంలో జరిగినట్లయినా జరగాలి. కానీ గతం కంటే తగ్గిపోయాయి. దీన్నిబట్టి మార్కెట్లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ప్రజల చేతుల్లో డబ్బులు లేవని తెలుస్తోంది. దీనికితోడు జిల్లాలో కరువు తాండవిస్తుండడంతో రైతుల్లోనూ, వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉండే రంగాల్లో కొనుగోలు శక్తి పడిపోయింది.

కలసిరాని ఆర్భాట ప్రచారం..

జిల్లాలో భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నాంరూ.వేల కోట్లు పెట్టుబడులు జిల్లాకు వస్తున్నాయి. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అంబానీ ఇక్కడ పరిశ్రమ పెడుతున్నాడని ఎల్లో గ్యాంగ్‌ హడావిడి సృష్టించింది. పశ్చిమ ప్రకాశం రూపురేఖలు మారిపోతున్నాయంటూ ఊదరగొట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని భారీ పరిశ్రమలు వస్తున్నాయని, నిరుపయోగంగా ఉన్న భూములు వినియోగంలోకి వస్తాయంటూ మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి అనుకూల మీడియా ఊదరగొట్టినా కనిగిరి, మార్కాపురం, దర్శి, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో గతేడాది కంటే ఆదాయం పడిపోవడం గమనార్హం. గతంలో చంద్రబాబు వేసిన ట్రిపుల్‌ ఐటీ, సోలార్‌ హబ్‌, నిమ్జ్‌లు నేటికీ కార్యరూపం దాల్చకపోవడం ఈ ప్రాంతవాసుల మదిలో మెదులుతూనే ఉంటుంది.

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలోనే రిజిస్ట్రేషన్‌ శాఖ రూ.171 కోట్లు నష్టపోయిందంటే ఈ రంగంలో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతోంది. పొలాలు, భూముల క్రయ విక్రయాలు కొనసాగటం గగనంగా మారాయి. చంద్రబాబు రాకతో రియల్‌ బూమ్‌ మరింత పడిపోయిందని రియల్టర్లు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోగా వడ్డీలు కట్టలేక అప్పుల పాలై ఆత్మహత్యలే శరణ్యమని గగ్గోలు పెడుతున్నారు. జిల్లా చరిత్రలో ఇంత ఘోరంగా నష్టపోవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.

జిల్లాలో పడిపోయిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నేల చూపులు చూస్తున్న రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.171 కోట్లు నష్టపోయిన ఆదాయం లక్ష్యం రూ.502.58 కోట్లు కాగా వచ్చింది రూ.331.23 కోట్లు మాత్రమే భూ విలువలు పెంచినా లక్ష్యానికి చేరుకోని పరిస్థితి జిల్లా కేంద్రం ఒంగోలు లక్ష్యం రూ.181 కోట్లు..వచ్చింది రూ.120 కోట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం కంటే రూ.15.44 కోట్లు తక్కువ కొత్త పరిశ్రమలు వస్తున్నాయని ఊదరగొట్టినా కానిరాని ఫలితం

కొనుగోలు శక్తి తగ్గింది

జిల్లాలోని ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. కరువు ఒక ప్రధాన కారణంగా ఉంది. రైతుల వద్ద డబ్బులు లేవు. దానికి తోడు జిల్లాలో ఏడాదిలో కొత్త ప్రాజెక్టులు కూడా ఏమీ రాకపోవటం కూడా ప్రధాన కారణం. విమానాశ్రయం వచ్చి, కొత్త ప్రాజెక్టు వస్తే మళ్లీ రియల్‌ ఎస్టేట్‌ పుంజుకోవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యం కంటే రూ.171 కోట్లు తగ్గింది. అంతకు ముందు సంవత్సరం వచ్చిన రాబడి కంటే కూడా రూ.15.44 కోట్లు తగ్గింది.

– ఆళ్ల బాల ఆంజనేయులు, జిల్లా రిజిస్ట్రార్‌

ఉక్కిరిబిక్కిరి!1
1/1

ఉక్కిరిబిక్కిరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement