తండ్రి చేతిలో కొడుకు హతం
● భార్యను కత్తితో పొడవబోయి అడ్డొచ్చిన కొడుకును పొడిచి..
● మద్యం మత్తులో దారుణం
అర్ధవీడు(కంభం): మద్యం మత్తులో భర్త..భార్యపై దాడి చేస్తుండగా కుమారుడు అడ్డురాగా కత్తిపోటుకు గురై మృతి చెందిన సంఘటన అర్థవీడులో చోటు చేసుకుంది. అందిన వివరాల మేరకు మద్యానికి బానిసైన షేక్ ఖాసిం వలి తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి భార్యతో గొడవపడి కత్తితో ఆమైపె దాడి చేస్తుండగా కొడుకు షాకీర్ (14) అడ్డు రాగా అతను కత్తిపోటుకు గురై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘర్షణ అనంతరం మృతుడి తల్లి, సోదరి కలిసి మద్యం మత్తులో ఉన్న ఖాసీంవలిపై దాడి చేశారు. అతన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. షాకీర్ మృతదేహం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో ఉంది.


