రైలు ఢీకొని ఆర్మీ రిటైర్డు జవాన్ మృతి
టంగుటూరు: రైలు ఢీకొని ఆర్మీ రిటైర్డు జవాన్ మృతి చెందాడు. ఈ సంఘటన టంగుటూరు సెంటర్లో రైల్వే గేటు వద్ద మంగళవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కొండపి గ్రామానికి చెందిన గడ్డిపాటి శ్రీనివాస్ ఆర్మీలో పనిచేస్తూ 2018లో రిటైర్డు అయ్యారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే శ్రీనివాస్ తల్లిదండ్రులు టంగుటూరులో నివాసం ఉంటున్నారు. వారిని చూసేందుకు రెండు రోజుల క్రితం టంగుటూరు వచ్చాడు. అయితే మంగళవారం ఉదయం టీ తాగేందుకు టంగుటూరు సెంటర్‌కు వస్తున్న క్రమంలో రైల్వేగేట్ దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. ప్రమాదంలో శరీర భాగాలు ముక్కలయ్యాయి. సంఘటనా స్థలానికి రైల్వే పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా ఈ నెల 20న నెల్లూరు రైల్వేస్టేషన్‌లో గార్డుగా విధుల్లో చేరాల్సి ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.


