ఉపాధ్యాయుల సీనియారిటీని పారదర్శకంగా ఇవ్వాలి
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను పారదర్శకంగా తయారు చేసి పదోన్నతులు ఇవ్వాలని యూటీఎఫ్ ప్రతినిధులు డీఈఓ ఏ కిరణ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ప్రకాశం జిల్లా శాఖ ప్రతినిధులు బుధవారం డీఈఓను కలిసి ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల విషయమై చర్చించి, మెమొరాండం అందించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్, డీ వీరాంజనేయులు, ఎస్ రవి, జీ ఉమామహేశ్వరి, ఎన్ చినస్వామి, బాలవెంకటేశ్వర్లు, నల్లూరి వెంకటేశ్వర్లు, ఎం సంధ్యారాణి, ప్రభాకర్‌రెడ్డి, ఎస్వీ కొండారెడ్డి, ఉమామహేశ్వరరావు, డీ జోత్న్స, రమణమూర్తి, ఆర్ నారాయణ, లక్ష్మీనారాయణ, దార్ల శ్రీను, కే హనుమంతరావు, చంద్రశేఖరయ్య, జిలానీ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో వినతిపత్రం
మే నెలలో నిర్వహించబోయే ఉపాధ్యాయుల పదోన్నతుల జాబితా మెరిట్ కం రోస్టర్ విధానంలో తయారు చేయాలని డీఈఓకు ఫ్యాప్టో ప్రతినిధులు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ కే ఎర్రయ్య, ఎండీ రఫీ, కో చైర్మన్‌లు వీ మాధవరావు, జయరావు, అబ్ధుల్‌హై, వీ జనార్ధన్, డీ శ్రీనివాసులు, చల్లా శ్రీనివాసులు పాల్గొన్నారు.


