అట్టహాసంగా ప్రభ తరలింపు
చీమకుర్తి రూరల్: మండలంలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో ఈనెల 12న జరిగే గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభ తడిక తరలింపు బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు వెంటరాగా బాణసంచాలు, డప్పుల మోతలతో చీమకుర్తిలోని బూచేపల్లి కళ్యాణ మండపం దగ్గర నుంచి రామతీర్థం నిధిలోకి ప్రభ తడికను ఊరేగింపుగా తరలించారు. కార్యక్రమానికి బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి గ్రామం నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్‌రెడ్డి, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గోపువరపు రాజ్యలక్ష్మి పూర్ణచంద్ర, గంగిరెడ్డి ఓబులరెడ్డి, చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, కౌన్సిలర్లు ఇందిరా సుందర రామిరెడ్డి, పాటిబండ్ల గంగయ్య, బాబురావు, యల్లయ్య, ప్రమీల రామబ్రహ్మం, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, బూచేపల్లి అభిమానులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభ తరలింపునకు భారీగా తరలివచ్చిన ప్రజలు పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ
అట్టహాసంగా ప్రభ తరలింపు
అట్టహాసంగా ప్రభ తరలింపు


