గంగమ్మా.. మళ్లొస్తాం!
నడి సంద్రంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నా నిర్భీతిగా వేట సాగించే మత్స్యకారులు ఒడ్డుకు చేరారు. మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలలపాటు వేటపై నిషేధం విధిస్తుండటం తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి నుంచే మొదలైన వేట నిషేధాజ్ఞలు జూన్ 15వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని తీరప్రాంత గ్రామాల మత్స్యకారులు మంగళవారం ఉదయానికి బోట్లు, వలలతో సహా ఒడ్డుకు చేరారు. బోట్లను ట్రాక్టర్ల సాయంతో తీరంలోని మెరక ప్రాంతానికి చేర్చారు. వలలను సరిచేసుకుంటూ, ఇంజిన్లను భద్రపరుచుకుంటూ రోజంతా క్షణం తీరిక లేకుండా గడిపారు. ‘వేటకు వెళ్లకపోతే పూట గడవదు. మత్స్యకార భరోసా ఇస్తే జీవనానికి ఇబ్బంది తప్పుతుంది. ప్రభుత్వం మాట నిలబెట్టుకుని రూ.20 వేలు ఇవ్వాలి’ అని జిల్లాలోని మత్స్యకారులు కోరుతున్నారు. – సాక్షి, ఒంగోలు
గంగమ్మా.. మళ్లొస్తాం!
గంగమ్మా.. మళ్లొస్తాం!
గంగమ్మా.. మళ్లొస్తాం!
గంగమ్మా.. మళ్లొస్తాం!
గంగమ్మా.. మళ్లొస్తాం!


