పొన్న వాహనంపై చెన్నకేశవుడు
మార్కాపురం టౌన్: స్థానిక లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామికి వివిధ వాహన సేవలు నిర్వహిస్తున్నారు. చెన్నకేశవ స్వామి వారు మురళీకృష్ణ అలంకారంలో పొన్న వాహనంపై శుక్రవారం ఉదయం భక్తులకు దర్శనమిచ్చారు. చెన్నకేశవ స్వామివారికి పుష్పాలంకారం, అర్చన, నివేదన, మంగళహారతి కార్యక్రమాలు ఆలయ అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, అర్చక బృందం నిర్వహించింది. అనంతరం స్వామి వారిని నాలుగు మాడ వీధుల్లో నగరోత్సవం చేశారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో ప్రధాన వీధులు ప్రజలు, భక్తులతో నిండిపోయాయి. ఏర్పాట్లను ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఆలయ సిబ్బంది పర్యవేక్షించగా పలువురు ప్రముఖులు, అధికారులు, భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. డప్పు వాయిద్యాలు, వేషధారణలతో నగరోత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.
చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు
నగరోత్సవంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పొన్న వాహనంపై చెన్నకేశవుడు
పొన్న వాహనంపై చెన్నకేశవుడు


