మహాశివరాత్రికి పటిష్ట భద్రత
● ఎస్పీ అఖిల్ మహాజన్
వేములవాడ: రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణ వ్యాప్తంగా పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాల కోసం చేస్తున్న ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా, జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజన్న ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల వద్ద పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సులువుగా దర్శనమయ్యేలా పట్టణంలో ప్రధాన మార్గాల్లో రూట్‌మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సై రాజు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment