5 లక్షల మందికి సన్నబియ్యం
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో ఐదు లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సన్నబియ్యం పంపిణీపై పౌరసరఫరాల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 345 దుకాణాల ద్వారా 1,73,578 రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలి పారు. ప్రతి నెలా 3,275 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. అంతకుముందు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానా యక్, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.వసంతలక్ష్మి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.రజిత పాల్గొన్నారు.
అర్హులకు రేషన్‌కార్డు జారీ చేయాలి
● అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్
సిరిసిల్ల: జిల్లాలో అర్హులకు రేషన్‌కార్డు జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం పౌరసరఫరాల అధికారులతో కలిసి టెలీకాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ప్రజాపాలన, మీసేవ, ఇతర మార్గాల ద్వారా రేషన్‌కార్డులకు వచ్చిన 30,977 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేశామని, వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి జాబితాను రూపొందించాలని, వాటిపై గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు తీసుకుని వాటిని తుది జాబితాను గ్రామసభల ద్వారా ఆమోదింపచేసుకుని రేషన్‌కార్డు జారీచేయాలన్నారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాభాయి, డీిసీఎస్‌వో పి.వసంతలక్ష్మి పాల్గొన్నారు.


