ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధిహామీ
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: రుద్రవరంలో ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పథకం పనులను శనివారం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న వారిని చూశానని, అందుకే పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలి పారు. జాబ్‌కార్డు అందించి పని కల్పిస్తామని తెలిపారు. సద్వినియో గం చేసుకోవాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పార్టీ మండలాధ్యక్షుడు పిల్లి కనకయ్య, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్ర, నాయకులు చింతపల్లి శ్రీనివాస్‌రావు, ఎర్రం రాజు, గాలిపెల్లి స్వామి, ఇటుకల రాజు, పండుగ ప్రదీప్, కదిరె రాజు, పండుగ ప ర్శరాములు, వంగ పర్శరాములు, దే వరాజు, కత్తి కనకయ్య, సత్తయ్య, వంకాయల భూమయ్య పాల్గొన్నారు.


