కార్మికులపై వివక్ష వీడాలి
● సమస్యలు పరిష్కరించకపోతే నిరాహార దీక్ష ● ఫ్లకార్డులతో నేతన్నల నిరసన
సిరిసిల్లటౌన్: నేతకార్మికులపై ప్రభుత్వం వివక్ష వీడాలని సీఐటీయూ పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 7 నుంచి 24 గంటల నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. సిరిసిల్లలో శనివారం నేతకార్మికులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. రమేశ్ మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వేతనం అందేలా కూలీ నిర్ణయించాలని కోరారు. నాయకులు కోడం రమణ, నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, ఉడుత రవి, ఒగ్గు గణేశ్, ఎలిగేటి శ్రీనివాస్, సబ్బని చంద్రకాంత్, భాస శ్రీధర్, వేణు, తిరుపతి, రాజు, రాము, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


