క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Apr 6 2025 2:03 AM | Updated on Apr 6 2025 2:03 AM

క్రీడ

క్రీడలతో మానసికోల్లాసం

వేములవాడ: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ.. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కోరారు. మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ఉన్నత చదువులతో ఎదగాలని ఆకాంక్షించారు. నిత్యం బిజీగా ఉండే డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, పోలీసులు, పాత్రికేయులు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు అంతా ఒక చోట చేరి క్రీడాపోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. పోలీస్‌ జట్టు విజేతగా, లాయర్ల టీమ్‌ రన్నరప్‌గా నిలిచాయి. మహిళా జట్టులో వేములవాడ జట్టు ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచింది. వీరికి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎస్పీ మహేశ్‌ బీ.గీతే, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్‌ బహుమతులు అందించారు.

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

విన్నర్స్‌ పోలీస్‌.. రన్నరప్‌ అడ్వకేట్స్‌

క్రీడలతో మానసికోల్లాసం1
1/1

క్రీడలతో మానసికోల్లాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement