బీజేపీతోనే సంక్షేమం
● పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లటౌన్: ప్రజాసంక్షేమ పాలన బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. పార్టీ 45వ స్థాపన దివస్ సందర్భంగా సిరిసిల్లలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జెండాను ఆవిష్కరించారు. నాయకులు ఆడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్, తవటం రాజలింగం, మొగిలి రాజు, ఎర్రం మహేశ్, అల్లాడి రమేశ్, కుమ్మరి శంకర్, మ్యాన రాంప్రసాద్, రాగుల రాజిరెడ్డి, చంటి మహేశ్, కర్నె హరీష, బర్కం వెంకటలక్ష్మీ పాల్గొన్నారు.


