వృద్ధాశ్రమంలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ
సిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం మండెపల్లి వృద్ధాశ్రమంలో 4 ఖాళీ పోస్టుల భర్తీకి ఆదివారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండెపల్లిలో ప్రకృతి స్వచ్ఛంద సంస్థ, ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో వృద్ధాశ్రమం కొనసాగుతోంది. 23 మంది దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తుదారులను కలెక్టర్ ముఖాముఖీ ఇంటర్వ్యూ చేశారు. ఎంపికై న వారి వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచుతామని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధిస్తాం
సిరిసిల్ల: బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానికసంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను సాధించే వరకు విశ్రమించేది లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. సిరిసిల్ల బీసీ భవన్‌లో ఆదివారం ముఖ్యప్రతినిధుల సమావేశం జరిగింది. పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ పెంచిన 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలని, నాన్చివేత ధోరణి వీడాలన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, బడ్జెట్‌లో నిధులు పెంచాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేని మల్లేశ్‌యాదవ్, పట్టణాధ్యక్షుడు తడక కమలాకర్, ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షుడు కంచర్ల రాజు, నాయకులు నల్ల శ్రీకాంత్, బో యిన శ్రీనివాస్, బచ్చు ప్రసాద్, చొక్కి కై లాస్, సబ్బని వేణు, కోడం రవీందర్, దుబాల కొండయ్య, చిందం శ్రీధర్ పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై సర్కార్‌కు చిత్తశుద్ధి ఏది?
ముస్తాబాద్(సిరిసిల్ల): రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శీలం స్వామి విమర్శించారు. ము స్తాబాద్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు చేసిన ప్రభుత్వం గవర్నర్ ఆమో దం ఇంత వరకు ఎందుకు పొందలేదో చెప్పాలన్నారు. గవర్నర్ ఆమోదం పొందకుండా ఢిల్లీలో ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. తమిళనాడులో మాదిరిగా ఇక్కడ అమలు చేయాలని కోరారు. నాయకులు కంచం నర్సింలు, విశ్వనాథం, అనిల్, సాయికృష్ణ, నర్సింలు ఉన్నారు.
సంఘం అభివృద్ధికి కృషి చేస్తా
● వీరశైవ లింగాయత్ లింగ బలిజ జిల్లా అధ్యక్షుడు సోమ్‌కుమార్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బలిజ సంఘం అభివృద్ధికి కృషిచేస్తానని వీరశైవ లింగాయత్ లింగ బలిజ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న సోమ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకటాల సోమేశ్వర్ ఆధ్వర్యంలో కమి టీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సోమ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పత్తి స్వా మి, ఉపాధ్యక్షుడిగా డాకూరి భూపతి, కోశాధికారి కొల్లేటి చంద్రమౌళిని ఎన్నుకున్నారు.
కార్మికులపై వివక్ష వీడాలి
సిరిసిల్లటౌన్: పవర్‌లూమ్ కార్మికులపై ప్రభుత్వం వివక్ష వీడాలని సీఐటీయూ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదననారు. స్థానిక పార్టీ ఆఫీస్‌లో ఆదివారం పవర్‌లూమ్స్, వైపని, వార్పిన్ కార్మికులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం 24 గంటలు నేతన్నల దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. కోడం రమణ, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, సబ్బని చంద్రకాంత్, ఎలిగేటి శ్రీనివాస్, మచ్చ వేణు, ఎక్కల్‌దేవి జగదీశ్, బొట్ల వెంకటేశం, ప్రవీణ్ పాల్గొన్నారు.
వృద్ధాశ్రమంలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ
వృద్ధాశ్రమంలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ


