రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి

Apr 8 2025 7:05 AM | Updated on Apr 8 2025 7:05 AM

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి

● బీజేపీ, బీఆర్‌ఎస్‌లు చీకటి దోస్తులు ● కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి

సిరిసిల్ల: రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన ‘జై బాపు.. జై భీమ్‌.. జై సంవిధాన్‌’లో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్‌ అని, రాజ్యాంగాన్ని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ద్వారా అందించింది కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లు నియంతృత్వ, నిరంకుశపోకడలతో పాలన సాగించాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు చీకటి దోస్తులని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్‌ పార్టీ కల్పించిందన్నారు. 30 ఏళ్లుగా సమస్యగా ఉన్న ఎస్సీ వర్గీకరణ చేశారన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొడుతూ రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా భారత్‌ జోడో యాత్ర చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించేందుకు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఏఐసీసీ కోఆర్డినేటర్‌ అవీజ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, ఏఎంసీ చైర్మన్‌ వెల్ముల స్వరూపారెడ్డి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, నాయకులు సంగీతం శ్రీనివాస్‌, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, ఆడెపు చంద్రకళ, కల్లూరి చందన, వైద్య శివప్రసాద్‌, రాగుల జగన్‌, గోలి వెంకటరమణ, నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్‌, భీమవరం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement